ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ

సర్పంచులకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యం? కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం సరికాదు. సర్పంచులకు అధికారాలు లేకుండా చేయడమే మీరు చెబుతున్న అధికార వికేంద్రీకరణా? పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ఏపీ లోని సర్పంచులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పంచాయితీల నిధులు రూ.3,450 కోట్లను తిరిగి ఇవ్వాలి.