Suryaa.co.in

Editorial

తాడేపల్లికి సీఆర్‌డీఎ సమాచారం లీక్?

  • పీఆర్వోగా వైసీపీ మీడియా ప్రతినిధి

  • పులివెందుల బంధంతో పోస్టింగ్

  • మంచి ప్రభుత్వమంటూ శివమెత్తుతున్న పసుపు సైనికులు

( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజధాని నిర్మాణ బాధ్యతను తలకెత్తుకున్న సీఆర్‌డీఏలో చీమచిటుక్కుమన్నా ఆ శబ్ధం తాడేపల్లికి చేరుతోందా? సీఆర్‌డీఏ నిర్ణయాలు, అంతర్గత వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌కు భద్రంగా చేరుతున్నాయా? ఆ మేరకు వైసీపీ కోవర్టు అక్కడ చురుకుగా పనిచేస్తుంటే ప్రభుత్వం ఇంకా ఆయననే ఎందుకు కొనసాగిస్తోంది? ఇదేనా మంచి ప్రభుత్వమంటే? అంటూ పసుపు సైనికులు సోషల్‌మీడియాలో శివమెత్తుతున్నారు.

గతంలో మంత్రిగా చేసిన ప్రకాశం జిల్లా మంత్రి ఒకరు వైసీపీ అధికార మీడియాలో పనిచేసే యాంకర్‌ను సీఆర్‌డీఓలో చేర్చారట. పులివెందులకు చెందిన ఈయన గతంలో సాక్షిలో యాంకర్‌గా చేశారని, పెద్దిరెడ్డి సిఫార్సుతో గ్రామవార్డు సచివాలయం సెక్రటరీగా నియమించారట. జగన్ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి, జగన్ వద్ద ఐదేళ్లు పనిచేసి చక్రం తిప్పిన మాజీ ఐఏఎస్ ధనంజయరె డ్డి ఆశీస్సులతో, సాక్షి మాజీ ఇప్పుడు ఏకంగా సీఆర్డీయే పీఆర్‌ఓగా ఉద్యోగం సంపాదించుకున్నారట.

కాగా ఈ నియమాకం ఆలస్యంగా తెలిసిన తమ్ముళ్లు, కారాలు మిరియాలు నూరుతున్నారట. సాక్షిలో పనిచేసే జర్నలిస్టును సీఆర్‌డీఏలో పీఆర్వోగా ఎలా నియమిస్తారు? ఇక అలాయితే సీక్ల్రెట్లకు అర్ధం ఏముంటుంది? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సో.. జగన్ మీడియా ఉద్యోగిని సీఆర్డీయేలో నియమించారంటే, జగన్ తెలివితేటలను మెచ్చాల్సిందే.

LEAVE A RESPONSE