Suryaa.co.in

Telangana

సిరిసిల్ల జిల్లాలో మగవారిపై కాకుల దాడి

(జానకీదేవి, తణుకు)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మగవాళ్లపై కాకులు పగ బట్టాయి. కేవలం మగవాళ్ల తలపై కాళ్లతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి. విచిత్రంగా ఉన్నా నమ్మి తీరాల్సిందే. ఇందుకు సంబం ధించిన వీడియోసైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. సిరిసిల్ల పాత బస్టాండ్ లో కట్ట మైసమ్మ గుడివద్ద తిరుగు తున్న మగవాళ్లపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి.బస్టాండ్ నుంచి బయటకు వెళ్లే వారిపై, లోపలికి వచ్చే మగవాళ్లను మాత్రమే తలపై తన్నుతూ చెట్టు కొమ్మపైకి వెళ్లి వాలుతు న్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. అక్కడి కాకులు మగవాళ్ల పైనే ఎందుకు దాడిచేస్తున్నాయంటూ ఆశ్చర్యపడు తున్నారు.

LEAVE A RESPONSE