– షుగర్ అదుపులో
– కడుపులో పుండ్లు రాకుండా
– దప్పిక కాకుండా
– డయాబెటిస్ నియంత్రణ
కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది.
శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు కీరా తినాలని సూచిస్తున్నారు. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి.
కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి.దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి. కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం నిర్జలీకరణ అవకుండా కాపాడుతుంది.
దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. కీర దోసను రసంగా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి.ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దప్పిక కాకుండా ఉంటుంది. కీరదోసను చక్రాలుగా తరిగి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ళ మంటలు తగ్గుతాయని వైద్య నిపుణులు సూచన.