Suryaa.co.in

Telangana

పీఎస్ లను సందర్శించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్, రవీంద్ర ఐపీఎస్

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్., ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, గచ్చిబౌలి విమెన్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు.

ఈ సందర్భంగా సీపీ గారు పోలీసు స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర ప్రతీ రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, ప్యాట్రోలింగ్ లను పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు. అలాగే విజిబుల్ పోలీసింగ్ ఉండేలా చూడాలి. ఫంక్షనల్ వర్టికల్ పర్ఫామెన్స్ ఇంప్రూవ్ చేయాలి. ఐటీ కంపెనీలు తిరిగి ప్రారంభమవుతునందున ట్రాఫిక్ సమస్యలు లేకుండా లా & ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు సమన్యాయంతో పని చేయాలి. Anti-Drug Abuse కమిటీ ల సహకారంతో డ్రగ్స్ మీద కఠిన చర్యలు తీసుకొని డ్రగ్ ఫ్రీ క్యాంపస్ లకోసం కృషి చేయాలి. రిసెప్షన్ లో ఎంతో సౌమ్యంగా ఉండి వారి సమస్యలను తెలుసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలి. పెట్రోలింగ్ బీసీలు ఏ విధంగా పనిచేస్తూనే పర్యవేక్షించి ప్రజలలో పోలీసుల ప్రెజెంట్స్ ఉండాలి. ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారు లకు తగిన విధంగా స్పందించాలి.

శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు. పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు. లా అండ్ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై సీపీ గారు సిబ్బందితో చర్చించారు. స్టేషన్ లోని సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావలన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారాన్ని, ఆధునికతను ఉపయోగించి నేరస్తులను గుర్తించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలనన్నారు.

సీపీ గారి వెంట మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, మాదాపూర్ ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, గచ్చి బౌలి ఇన్ స్పెక్టర్ సురేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE