ఇంటి పన్నూల వసూలు ప్రజల ఇండ్లకేనా? ప్రభుత్వ ఇళ్లకు లేదా?

రాష్ట్రం మొత్తం మీద అన్ని మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను వసూళ్లు ముమ్మరం చేశారు. ప్రజలను భయభ్రాంతుల్ని చేసి ఇళ్లకు తాళాలు వేసి (లోపల మనుషులు ఉన్నప్పటికీ) మున్సిపాలిటీ అధికారులు సీల్ వేసి పోతున్నారు. కొంతమందికి కొన్ని ఇళ్లకు రెడ్ నోటీస్ జారీ చేసి ,జప్తు కు ఆదేశిస్తున్నారు. ఒక్కసారిగా కలకలం సృష్టించడం, అలజడి కావడం మున్సిపాలిటీ అధికారులకు మంచిది కాదు.

ఎందుకంటే మీరు ఇంటి పన్ను కు రెండు రూపాయలు వడ్డీ తో కలిపి, డిమాండ్ నోటీస్ ఇచ్చి వసూలు చేస్తున్నారు. ప్రజలు కట్టే వసతి లేక ఆలస్యంగా కట్టినా మున్సిపాలిటీలకు ఏమి నష్టం లేదు. వసతి ఉంటే ఎవరు కూడా ఇంత దూరం తెచ్చుకోరు. అయినా కూడా సమయానికి కట్టక పోవడం ప్రజల అలసత్వం తప్పే.

అయితే సామాన్య ప్రజలు ఇంకొక విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు అదేమిటంటే.. మున్సిపాలిటీ లో ఇంటి పన్ను ల బాకీ లో 25 నుండి 30 శాతం వరకు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసు .మరి మున్సిపాలిటీ అధికారులు సామాన్య ప్రజల ఇళ్లను జప్తు చేసి లోపల ఆడ, మగ ,పిల్ల, పీచుు , ముసలి ,ముతక ఉన్నప్పటికీ కూడా మీరు సీల్ వేసి పోతున్నారు కదా.

మరి ఇదే చట్టాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఉపయోగిస్తారా ! కలెక్టర్ కార్యాలయాలు పోలీస్ కార్యాలయాలకు తాళాలు వేసి సీల్ వేసేయండి.మీరు ఆ పని చేయకపోతే మీ లాలూచీ ఏమిటి ? అంటే న్యాయం సామాన్య ప్రజలకు ఒక రకం ప్రభుత్వానికి ఒక రకమా !మున్సిపల్ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ, పన్ను కట్టకపోతే నోటీస్ ఇవ్వ వద్దా, తాళాలు వేయ వద్దా అని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా చేయవలసిందే.

మంత్రిగారు మరి మీ ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీస్ లు, పోలీస్ ఆఫీస్ లు ,వివిధ రకాలైన కార్యాలయాలు కూడా రాష్ట్రం మొత్తం మీద వందల కోట్లు బాకీలు ఉన్నాయే. ఇదే పద్ధతి వర్తింపు చెయ్యాలి కదా ! మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు. అంటే నోరు లేని ప్రజలంటే చులకనా ! ఏమి చేయలెరనా! మంత్రిగారి స్థాయిలో మాట్లాడేటప్పుడు ప్రతి విషయం మాట్లాడాలి మంచి పద్ధతి కాదు. అందరికీ ఒకే చట్టం అమలు చెయ్యండి .అప్పుడే ప్రజలు హర్షిస్తారు ప్రజలకు మున్సిపాలిటీ అంటే భయం వస్తుంది భక్తి వస్తుంది.

అలా కాకుండా కేవలం నోరులేని పేద ప్రజల ఇళ్లను మాత్రమే సీల్ వేస్తూ, జప్తులు చేస్తూ పోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అప్పుడు మీరు ఏమీ చేయలేరు గుర్తుంచుకోండి .

– కరణం భాస్కర్
బిజెపి ,
7386128877.

Leave a Reply