సమాజ పురోగాభివృద్ధి కి ప్రతిబంధకాలు అవిద్య అజ్ఞానం అంధ విశ్వాసాలు. నరేంద్ర అచ్యుత్ దభోల్కర్ హేతువాది, మహారాష్ట్రకు చెందిన రచయిత. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా గళం విప్పి వాటి నిర్మూలనకు “మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి ” స్థాపించాడు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాడు.
దభోల్కర్ 1945 నవంబరు 1 లో అచ్యుత్, తారాబాయి దంపతులకు జన్మించాడు. వీరికి 10 మంది సంతానం. కనిష్ఠ కుమారుడు నరేంద్ర దభోల్కర్. సతారా, సాంగ్లీలలో విద్యాభ్యాసం జరిగింది. వైద్యపట్టా ‘మీరజ్’ మెడికల్ కాలేజినుండి పొందాడు. ఇతను షైలాను వివాహమాడాడు, వీరికి ఇద్దరు సంతానం, కొడుకు హమీద్, కుమార్తె ముక్తా దభోల్కర్. తన కుమారునికి ప్రముఖ సంఘసంస్కర్త హమీద్ దల్వాయ్ పేరును పెట్టాడు.
శివాజీ విశ్వవిద్యాలయంలో కబడ్డీ కేప్టన్ గా ఉన్నాడు. ఇతడు భారత్ తరపున బంగ్లాదేశ్ లో కబడ్డీ టోర్నమెంటులో పాల్గొన్నాడు. ఇతడికి మహారాష్ట్ర ప్రభుత్వంచే ” శివ ఛత్రపతి యువ పురస్కారం ” లభించింది. వైద్యుడిగా 12 సం.లు పనిచేసిన తరువాత దభోల్కర్ సామాజిక రంగంలో 1980 లో ఉద్యమించాడు. బాబా అధవ ఉద్యమమైన వన్ విలేజ్ – వన్ వెల్ లాంటి సామాజిక న్యాయ ఉద్యమాలలో పాల్గొన్నాడు.
ఆ తరువాత దభోల్కర్ అంధవిశ్వాసాలను రూపుమాపాలనే దృష్టితో అఖిలభారతీయ అంధశ్రద్ధా నిర్మూలన సమితిలో చేరాడు. మూఢనమ్మకం అనేది అంధ విశ్వాసం. మూఢనమ్మకాలను పెంచే వారు అన్ని మతాలలో అనుసరిస్తున్నారు. ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ ఏర్పాటు చేసిన అంధ శ్రద్ద నిర్ములన్ సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ అభ్యుదయ సంస్థ సమాజంలో దోపిడీ బువాబాజీని కలిగి ఉండడం, మత గురువును కలిగి ఉండటం ఒకరి జీవితాన్ని అతనికి అంకితం చేయడం మూఢనమ్మకాలను పెంచే మతపరమైన ఆచారాలను ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా వ్యతిరేకించారు.
ఈ దోపిడీ వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి ఆంధ్ శ్రద్ధ నిర్ములన్ సమితి వివిధ పద్ధతుల ద్వారా నిర్మూలిస్తుంది. ఇది చాలా మంది ముస్లిం బాబాలు బువ్వలకు వ్యతిరేకంగా పోరాడింది. తమ ప్రార్థనల వల్ల అంధులకు మళ్లీ చూపు వస్తుందని, మూగవారు మాట్లాడటం ప్రారంభిస్తారని, కుంటివారు నడుస్తారని వాదించే క్రైస్తవ మతగురువులపై కూడా ఈ సంస్థ పోరాడింది. జైనుల అర్థంలేని ఆచారాలను కూడా సంస్థ వ్యతిరేకించింది.
ఫల్తాన్ తాలూకాలో, తమను తాము బౌద్ధులుగా పిలుచుకునే వారు ఆచరించే ఒక గ్రామ దేవాలయం గోడకు తలలు కొట్టే ఆచారం ఇలా అన్ని మతాలలో ఉన్న చండాలన్నీ వ్యతిరేకించారు. 1989 లో ‘మహారాష్ట్ర అంధశ్రద్ధా నిర్మూలన సమితి ‘ ని స్థాపించి అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు. మాంత్రిక తాంత్రికుల క్షుద్రవిద్యలకు వ్యతిరేకంగా పనిచేశాడు.
దేశంలో ‘గాడ్ మెన్ ‘ లుగా ప్రసిద్ధి చెందిన సాధువులనూ వారి లీలలను, మాంత్రిక శక్తులనూ ఖండించాడు, విమర్శించాడు, వారి శిష్యులనూ భక్తగణాలనూ విమర్శించాడు. సతారా లోని “పరివర్తన్” సంస్థకు స్థాపక సభ్యుడు. ప్రముఖ భారతీయ హేతువాద సంస్థ యైన సనల్ ఎదమరుకు తో సమీప సంబంధాలను కలిగి ఉన్నాడు. సానే గురూజీ స్థాపించిన మరాఠీ వారపత్రికైన “సాధన”కు దభోల్కర్ ఎడిటర్.
భారతీయ హేతువాద సంఘానికి ఉపాధ్యక్షుడిగానూ సేవలందించాడు. 1990–2010 మధ్యకాలంలో దభోల్కర్ దళితుల సమానత్వంకోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు, మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి ‘బాబాసాహెబ్ అంబేద్కర్ ‘ పేరును పెట్టడం కోసం పోరాడాడు. మూఢ నమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివి ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని “మూఢ నమ్మకాలు” అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి. మనిషిని మనిషి లాగా ఉండనివ్వదు, మనిషిని మూర్ఖం గా మారుస్తుంది ఈ మూఢ నమ్మకం.ఇలాంటి అంధవిశ్వాసాలూ వాటి నిర్మూలన గురించి పుస్తకాలు వ్రాసాడు. దాదాపు 3000 పైగా సభలను ఉద్దేశించి ప్రసంగించాడు. హోళీ సందర్భంగా ఆసారాం బాపూ ను విమర్శించాడు, మహారాష్ట్రలో తీవ్ర కరవు అలుముకుని ఉంటే హోళీ పండుగ సందర్భాన అతని శిష్యగణానికి నీటిని వృధా చేస్తున్నందున తీవ్రంగా వ్యతిరేకించాడు.
2010 దభోల్కర్ అనేక పర్యాయాలు మహారాష్ట్రలో “అంధవిశ్వాసాల వ్యతిరేక బిల్లు” తేవడానికి ప్రయాసపడ్డాడు, కాని విజయం పొందలేక పోయాడు. ఇతని ఆధ్వర్యంలో “జాదూ టోనా వ్యతిరేక బిల్లు” ముసాయిదా తయారైంది. ఈ బిల్లును హిందూ తీవ్రవాద సంస్థలు, హిందూ ఛాందసవాదులూ, అభ్యుదయ వ్యతిరేక వాదులూ తీవ్రంగా వ్యతిరేకించాయి, అలాగే వర్కారీ తెగ కూడా వ్యతిరేకించింది. రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, శివసేన మొదలగు పార్టీలూ వ్యతిరేకించాయి.
ఈ బిల్లు వలన భారతీయ సంస్కృతి, విశ్వాసాలు, ఆచారాలు దెబ్బతింటాయని వాదించాయి. విమర్శకులైతే ఇతడిని “మత వ్యతిరేకి”గా అభివర్ణించారు. ఫ్రాన్స్ ప్రెస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దభోల్కర్ ఇలా అన్నాడు “ఈ బిల్లులో ఒక్క పదమైనా దేవుడు లేదా మతం అనేవాటికి వ్యతిరేకంగానూ లేదా గురించినూ లేదు. ఇలాంటిదేమీ లేదు. భారత రాజ్యాంగం మతపరమైన హక్కును స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది, ఎవరైనా ఏ మతమైనా అవలంబించవచ్చును.
కానీ ఈ బిల్లు, అంధవిశ్వాసాలకూ, ద్రోహపూరిత ఆచారాలగూర్చి మాత్రమే. మరణానికి కొద్ది వారాలకు ముందు దభోల్కర్ ఈ బిల్లు గురించి చర్చే జరగలేదు, ఎన్నిసార్లు శాసనసభలో ప్రవేశపెట్టబడిననూ చర్చలకు నోచుకోలేదని విమర్శించాడు. మహారాష్ట్రలో అభ్యుదయ భావాలకు ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అడ్డంకిగా తయారయ్యాడనీ విమర్శించాడు. దభోల్కర్ హత్య జరిగిన తర్వాత రోజు, మహారాష్ట్ర కేబినెట్ ఈ “జాదూ టోనా వ్యతిరేక-బిల్లు”ను ఆర్డినెన్స్ ద్వారా పాస్ చేసింది.
అయినా ఇపుడు ఈ బిల్లు శాసనంగా మారుటకు పార్లమెంటు ఆమోదించాల్సి వుంటుంది. దభోల్కర్ అనేక హత్యాబెదిరింపులకు ఎదుర్కొన్నాడు. 1983 నుండి అనేక అవమానాలనూ భరించాడు. పోలీసుల భద్రతను వద్దన్నాడు. 2013 ఆగస్టు 20 న హత్య గావింపబడ్డాడు. ఉదయాన కాలినడక బయల్దేరాడు, ఓంకారేశ్వర్ మందిరం వద్ద గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంలో వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. రెండు బుల్లెట్లు అతని తల, చాతీలోనూ దూసుకుపోయాయి.
పుణె లోని ససూన్ వైద్యశాలలో మరణించాడు. దభోల్కర్ హత్యను అనేక రాజకీయ పార్టీల నేతలు, సామాజిక వేత్తలు, సంఘ సేవకులు ఖండించారు. అనేక రాజకీయ పార్టీలు ఆగస్టు 21 న పుణెలో బంద్ ను ప్రకటించాయి. పుణె నగరంలోని అనేక సంస్థలు దభోల్కర్ హత్యకు నిరసనగా బందును పాటించి తమ సంస్థలను మూసి ఉంచాయి. నరేంద్ర దభోల్కర్ జీవితాంతం అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన ధీరోదాత్తుడు.
