Suryaa.co.in

Andhra Pradesh

నాడైనా, నేడైనా బొటనవేలు తెగనరుక్కుంది దళిత గిరిజనులే

-జగన్ మళ్లీ శ్రీలక్ష్మి బొటన వేలు అతికించగలరా?
-దళతుల చేతనే జగన్ గంజాయి అమ్మిస్తున్నారు
-మళ్లీ వేధింపులకు గురి కావడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలా?
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

నాడైనా, నేడైనా బొటనవేలు తెగనరుక్కుంది దళిత గిరిజనులే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు …

జగన్ అధికార పాఠాన్ని అధిష్టించినప్పటి నుంచి అంతా అరాచకమే. రాష్ట్రంలో అనేక నీతిమాలిన చర్యలు జరుగుతున్నాయి. అనేక అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి. అనేకమంది అమాయక బిడ్డలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైస్కూల్ విద్యార్థులు అనేక మంది గంజాయి బారిన పడుతున్నారు. 15 సంవత్సరాల పిల్లలు గంజాయి, సారాయి తాగడానికి అలవాటుపడుతున్నారు. వారిలో ముఖ్యంగా దళిత బిడ్డలే అధికం.

జగన్ దళతుల చేతనే గంజాయి అమ్మిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయి. పోలీసులు ఈ అరాచకాలను అదుపు చేయాలనుకుంటే చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి వారిని చేయనివ్వడంలేదు. ఒక దళిత వర్గానికి చెందిన మహిళ ఎందుకు వేలు కోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది?. నా దళత బిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తున్నాను. న్యాయం జరగలేదని ఢిల్లీ వెళ్లి శ్రీలక్ష్మి గగ్గోలు పెట్టాల్సి వచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో దళిత బిడ్డలు అన్యాయమైపోతున్నారు. గంజాయి, సారాయి తాగి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. క్రిమినల్స్ గా మారుతున్నారు.

న్యాయం జరగకపోవడంతో దళితురాలు శ్రీలక్హ్మి ఢిల్లీ వెళ్లి బొటన వేలు నరుక్కున్నదంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఏ మొహం పెట్టుకొని ఓట్లడుగుతారు? మళ్లీ వేధింపులకు గురి కావడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలా? ఏకలవ్యుడి బొటన వేలు తెగ్గొట్టారు, నేడు బొటన వేలు నరుక్కున్న శ్రీలక్ష్మి కూడా దళితురాలే. ఇటువంటి పరిస్థితులు దళితులకే ఎందుకు వస్తాయి? దళిత సామాజిక వర్గాన్ని, పేదరికాన్ని ఒక అలుసుగా తీసుకుంటున్నారు. గుంటూరు స్వర్ణభారతి నగర్ బాగుంది, ప్రశాంతంగా ఉందని గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా? స్వర్ణభారతి నగర్ తో పాటు రాష్ట్రంలో గంజాయి, లిక్కర్ యదేచ్ఛగా దొరుకుతోంది.

ఆడపిల్లల్ని ఇష్టమొచ్చినట్లు అల్లరి పట్టిస్తున్నారు. దళిత అమ్మాయిలు రోడ్లపై తిరగాలంటే భయపడుతున్నారు. దళితులు తమ ఆడబిడ్డలను బయటికి పంపాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా, గగ్గోలు పెట్టినా ఫలితంలేదు. స్థానిక వైసీపీ నాయకురాలు పిల్లి మేరీ ఎంతటి ఘనాపాటో ఈ సంఘటనలను బట్టి అర్థమౌతోంది. పిల్లి మేరీ గుంటూరు స్వర్ణభారతి నగర్ ని శాసిస్తోంది. ఈమె అసాంఘిక శక్తులకు నీడనిస్తున్నట్లు తెలిసింది. ఆమె కనుసన్నల్లో వ్యవస్థలు నడుస్తున్నాయంటే ఎంత సిగ్గుచేటు, ఎంత దుర్మార్గం?

శాంతిభద్రతలను కాపాడటానికి, సమాజాన్ని ఉద్ధరించటానికి ఉన్నారా? లేక అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఉన్నారా? సారా మత్తులో ముంచటానికి, గంజాయి తాగించడానికి కాదు జగన్ రెడ్డికి అధికారమిచ్చింది. దళిత బిడ్డలకు స్వచ్ఛగా తిరిగే హక్కు లేదా? మనం ఆధునిక సమాజంలో ఉన్నామా? ఆటవిక సమాజంలో ఉన్నామా? ఆటవిక సమాజానికి మారుపేరు జగన్ రెడ్డి ఈ ఐదేళ్ల పాలన. కాదంటారా? ఈ విషయంపై చర్చకు రాగలరా? కోపూరి శ్రీలక్ష్మి ఢిల్లీ పుర వీధుల్లో బొటన వేలు నరుక్కుంది జగన్ పరిపాలన ఎలా సాగుతోందో కళ్లు తెరిపించడానికే వేలు నరుక్కున్నానంటోంది.

జగన్ మళ్లీ శ్రీలక్ష్మి బొటన వేలు అతికించగలరా? రాష్ట్రంలో ఐదేళ్లు ప్రజాస్వామ్య పాలన నడవలేదు, ఆటవిక పాలన నడుస్తోంది. రాక్షస పాలన నడుస్తోంది. రాజ్యాంగబద్ధమైన పాలన అందించాల్సిన జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి పాలన అందిస్తున్నారు. నిబద్ధత కలిగిన పోలీసులు రాష్ట్రంలో అనేకమంది వున్నారు. వీరు బాధపడుతున్నారు. కూడా ఏమి ఈ పరిపాలన అని ఈసడించుకుంటున్నారు. కొద్ది మంది మాత్రం జగన్ మోచేతి నీరు తాగుతున్నారు. ఆటవిక సామ్రాజ్యం.. నేను రాజకీయం కోసం ఆమెను సంప్రదించలేదు, సాటి కులస్థురాలిగా సంప్రదించాను. తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చాలని సంప్రదించలేదు. సజాజం కళ్లు తెరవాలి. ప్రశ్నించడం నా జన్మ హక్కు. అధైర్యపడొద్దు.

కోపూరి లక్ష్మి : మా నాన్న నామాల కృష్ణమూర్తి మంచి పేరు గలవారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ప్రభుత్వంతో ఎంతో పోరాడారు. అంటరానితనాన్ని నిర్మూలించడంలో ఎంతో కృషి చేశారు. ప్రశ్నించడం నా హక్కు కొడతారా కొట్టండి, దొంగ కేసులు పెడతారా పెట్టండి, ప్రశ్నించడం ఆపను. మానవ హక్కుల సంఘానికి చెప్పినా చర్యలు లేవు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా చేశాను. దుర్మార్గపు పాలన. నేను వేలు తెగ్గోసుకుని శరీరానికి కలిగిన బాధ కన్నా రాష్ట్రంలో మహిళలు పడుతున్న అవస్థల బాధ ఎక్కువ. ఎంతమంది అభాసుపాలౌతున్నారు. దెబ్బలు తింటున్నారు. అన్యాయమౌతున్నారు, దెబ్బలు తింటున్నారు. మానభంగానికి గురౌతున్నారు.

నా ప్రాంతంలో పత్తిపాడు, స్వర్ణభారతి నగర్ లో ఆడపిల్లలకు చాలా అన్యాయం జరుగుతోంది. మైనర్ బాలికలకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదు. గంజాయి ఏరులై పారుతోంది. గంజాయి అమ్మే వారిని పట్టుకోకుండా, తాగేవాళ్లని పట్టుకుంటున్నారు. రౌడీలతో బెదిరిస్తున్నారు. దొంగ డి ఫారాలు బయటికి వస్తున్నాయి. ఈ విషయంపై దాదాపు 200 మంది మహిళలు ధర్నా చేస్తే భూ కబ్జాలు మహిళా లోకానికి కళ్లు తెరిపించాలనే నేను నా బొటన వేలును తెగ్గోసుకున్నాను. ఎన్ని సార్లు ఫైళ్లు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.

హోంమంత్రి సుచరిత వద్దకు కూడా ఫైల్ తీసుకొని వెళ్లాను. చూస్తాలే పొమ్మని నా కళ్ల ముందే ఫైల్ విసిరి పరేయడం జరిగింది. స్థానిక అప్పిరెడ్డి సపోర్టు ఇచ్చారు. ఆడవారు ఎలా బతికేది, ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రానికే కాదు, దేశానికి చూపాలని ఇలా చేశాను. నాకు అన్యాయం జరగకపోవడంతో ఢిల్లీ వెళ్లి అక్కడ మోడీ, ముర్ము, జస్టీస్ చంద్రచూడ్ లకు పిటిషన్ అందజేశాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కళ్లు తెరవాలి. ఆడవారికి రక్షణ కల్పించాలి. నవరత్నాల చాటున చాలా మోసం జరుగుతోంది.మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయి. మహిళలు ఎవరూ మోసపోవద్దు. అందరూ గట్టిగా నిలవాలి.

LEAVE A RESPONSE