Home » చట్టసభల్లో మగవారితో సమానంగా మహిళల ప్రాతినిధ్యం

చట్టసభల్లో మగవారితో సమానంగా మహిళల ప్రాతినిధ్యం

-సైకో రెడ్డి మళ్లీ వస్తే రాష్ట్రంలో నుంచి పారిపోవాల్సిందే
-డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు
-గుక్కెడు నీళ్లివ్వడం చేతకాని సీఎం…గంజాయి, మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు.
-ఆడబిడ్డలను సంపన్నులను చేసే బాధ్యత తీసుకుంటాం
-సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
-సంపద సృష్టి టీడీపీకే సాధ్యం….పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం
-గజపతినగరం ఆడబిడ్డలతో ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

గజపతినగరం : అధికారంలోకి రాగానే నా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రూ. 10 లక్షల వర్తింపజేస్తామని హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ పుట్టిల్లు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమైంది. ఈ గజపతినగరంలో నా ఆడపడుచుల హుషారు చూస్తుంటే సంతోషంగా ఉంది. మగవారితో ఏ విషయంలోనూ మహిళలు తక్కువకాదు. గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుని భారీ మెజారిటీతో గెలిపించండి. మోసగాళ్లు రకరకాల మాయమాటలు చెబుతారు.

మరోసారి నమ్మి మోసపోవద్దు. ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ. 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారు. కానీ నేడు జగన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పు ఇచ్చాడు. మహిళలు చదువుకొని ఉన్నతస్థానాల్లో ఉండాలని అన్న ఎన్టీఆర్ మహిళా వర్సిటీ స్థాపించారు. ఇంట్లో ఉండే ఆడవారిని రాజకీయాల్లోకి తెచ్చారు. మహిళలు చదువు కోవాలని నేను ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల , ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హైస్కూలు, ప్రతి మండలానికీ జూనియర్ కళాశాల, ప్రతి డివిజన్ కో ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిలాకో మెడికల్ కాలేజీతో పాటు వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాను.

మహిళలకు విద్యారంగం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ఒకప్పడు ఆడపిల్లలు కట్నాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆడపిల్లలకు రివర్స్ లో కట్నాలు ఇస్తున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని డ్వాక్రా వ్యవస్థ తెచ్చాను. మనం అధికారంలోకి రాగానే డ్వాక్రాను బలోపేతం చేసి అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తాను. 1997లో బాలికా శిశు సంరక్షణ పథకం తెచ్చి పుట్టిన ఆడబిడ్డ పేరున రూ. 5 వేలు డిపాజిట్ చేశాం. ఆ చిన్నారి పెద్దయ్యాక ఆ డబ్బు ఇచ్చి ఆదుకున్నాం. 8,9,10వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లిచ్చాం. మహిళల పేరు మీదనే ఇళ్ల పట్టాలు, రైతుబజార్లు, ఇసుక ర్యాంపుల నిర్వహణ అప్పగించాం.

మహిళా స్పీకర్ గా ప్రతిభా భారతిని నియమించాం. రూ. 8,500 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేశాం. రూ. 10,000 కోట్లు పసుపు కుంకుమ కింద ఇచ్చాం. నా అక్కచెల్లెమ్మలకు సమాన న్యాయం చేయాలని పదివేలు ఇచ్చాం. కానీ జగన్ రెడ్డి మాయమాటలు నమ్మి డ్వాక్రా మహిళలు ఐస్ అయ్యారు. ఈసారి తప్పు జరగనివ్వొద్దు. ఈ ఐదేళ్లలో మీ ఆదాయం పెరగలేదు. రూ. 10 ఇచ్చి రూ. 100 దోచేస్తున్నాడు. నేను మీ ఆదాయంతో పాటు జీవన ప్రమాణాలు పెంచాను. వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. కానీ నేడు ఆ రుణాలు ఇస్తున్నారా? భవిష్యత్ లో రూ. 10 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇస్తున్నారు.

మరోవైపు మహిళలకు దీపం పథకం కింద 65 లక్షల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చాం. మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందజేశాం. అన్న అమృత హస్తం కింద గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చాం. నవజాత శిశువులకు బేబీ కిట్లు, తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ , బాలామృతం అందించాం. సామాహిక శ్రీమంతాలు చేశాం. పెళ్లికానుకలు ఇచ్చాం. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలని తల్లికి వందనం పెట్టాం. మేము మహిళాభ్యున్నతికి అమలు చేసిన 22 పథకాలను జగన్ రెడ్డి కక్షపూరితంగా రద్దు చేశాడు. చట్టసభల్లో పురుషులతో సమానంగా మహిళలతో ప్రాతినిధ్యం వహించే రోజులొస్తాయి.

సైకో సీఎంతో అన్నీ కష్టాలే
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని రేట్లు పెరిగిపోయాయి. మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచాడు. ధరల పెంపుతో పేద, మధ్యతరగతిని రోడ్డున పడేశాడు. ఈ ఐదేళ్లలో ఒక్కరికి ఉద్యోగం లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. డీఎస్సీ లేదు. ఈ సైకో వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం? జే బ్రాండ్స్ లిక్కర్, గంజాయి వల్ల యువత భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. గంజాయి తీసుకున్న వాడికి భార్య, తల్లికి కూడా తేడా తెలీదు.

ఈ ఐదేళ్లలో మహిళలపై దాడులు పెరిగాయి. 80 శాతం మహిళలు అదృశ్యమయ్యారు. లైంగిక వేధింపులు 35 శాతం , దాడులు 32 శాతం పెరిగాయి. భవిష్యత్ లో బాదుడు లేని సంక్షేమం ఇస్తాం. ఆదాయం పెంచుతాం. గజపతి నగరంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటాం. పరిశ్రమలు తెచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం. సంక్షేమం, అభివృద్ధిని సైకో రెడ్డి విస్మరించడం వల్ల రాష్ట్రం భ్రష్టుపట్టి పోయింది.

మహాశక్తి…మహిళా శక్తి
మహిళలను ఆదుకునేందుకే సూపర్ సిక్స్ తెచ్చాం. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మహాశక్తి పథకానికి రూపకల్పన చేశాం. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత అందించబోతున్నాం. అమ్మఒడి పేరుతో జగన్ రెడ్డిలా మోసం చేయడం మనకు అలవాటు లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ చదివించాలని తద్వారా వారి జీవితాలు బాగుపడతాయని నేను ఆలోచించాను.

ఆడపిల్లల రక్షణకు నేనే డ్రైవర్ గా ఉండి నడిపిస్తా. ఆడబిడ్డలు తయారు చేసి వస్తువులను డ్వాక్రా బజార్లు పెట్టి దేశ విదేశాల్లో అమ్మించాం. ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తాం. వచ్చే ఐదేళ్లలో అన్ని గ్రామాలు, ఇళ్లకు నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. కేంద్రం ఇస్తానన్నా జలజీవన మిషన్ సద్వినియోగం చేసుకోవడంలేదు. నీరివ్వలేని ముఖ్యమంత్రి మద్యం మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నాడు. నా చిన్నప్పుడు మా ఊరిలో కరెంటు కూడా ఉండేదికాదు. ఆ ఇబ్బందులు కళ్లారా చూశాను కాబట్టి విద్యుత్ సంస్కరణలు తెచ్చి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని తయారుచేశాను. నా ధ్యేయం పేదరికం లేని సమాజం .

సంపద పంచి పేదల జీవితాల్లో వెలుగులు తెస్తా
సంస్కరణల ద్వారా సంపద సృష్టి టీడీపీకే సాధ్యం. పెంచిన ఆదాయం పేదలకు పంచి వారి జీవితాల్లో వెలుగులు తెస్తాను. నన్ను 40 ఏళ్లు గౌరవించారు. తెలుగుజాతిలో నాకిచ్చిన గౌరవం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ సైకో రెడ్డి అందర్నీ ఇబ్బందులు పెడుతున్నాడు. నా శేష జీవితం ప్రజాసేవకే. రేయింబవళ్లు కష్టపడి పేదలను ఆదుకుంటాను. అమరావతి మొదలుపెట్టా . పోలవరం 72 శాతం పూర్తిచేశాను. రూ. 16 లక్షల కోట్ల ఎంవోయూలు చేసుకున్నాం.

అధికారంలోకి రాగానే గజపతినగరం స్థానిక సమస్యలను పరిష్కరిస్తాం. మగవారితో పోలిస్తే మహిళలు చాలా తెలివైన వారు. మీ సెల్ ఫోన్లో ఇంటి ఖర్చులు ఎంతవుతున్నాయో చూసుకోండి. మన ప్రభుత్వంలో ఎలా ఉంది. ..సైకో రెడ్డి ప్రభుత్వంలో ఎలా ఉందో చెక్ చేసుకోండి. సైకో ఇచ్చింది ఎంత …బొక్కింది ఎంతో చూడండి.

సైకో రెడ్డి మళ్లీ వస్తే రాష్ట్రంలో నుంచి పారిపోవాల్సిందే. భూ హక్కు చట్టం కింద మన ఆస్తులు కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. పట్టాదారు పాస్ బుక్ మీద జగన్ రెడ్డి పేరు వేయడమేంటి? మీ భూమి మీద సైకో పెత్తనమేంటి? సర్వే రాళ్లపై జగన్ రెడ్డి ఫోటోలు తీసేయండి. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు

Leave a Reply