Suryaa.co.in

Andhra Pradesh

అక్టోబర్ 2 న నారా భువనేశ్వరి నిరాహారదీక్ష

చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి ? అరెస్ట్ చేసి 22 రోజులైనా ఒక్క ఆధారం సేకరించలేకపోయారు
జగన్ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా అక్టోబర్ 2 న నారా భువనేశ్వరి ఒక్క రోజు నిరాహారదీక్ష చేస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నంద్యాలలో పార్టీ పొలిటికల్ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట తో రాష్ట్ర వ్యాప్తంగా గుండెపోటుతో చనిపోయిన వారికి నివాళులర్పించారు.

అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ……చంద్రబాబు నాయుడు బయటకి వచ్చిన తరువాత వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం.అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఒక రోజు పాటు నిరాహారదీక్ష చేయనున్నారు.

అలానే అదే రోజు రా.7 గంకు చంద్రబాబు గారి అరెస్ట్ ను ఖండించిన వారు, దేశం మరియు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక 5నిమిషాల పాటు తమ ఇంట్లోని లైట్స్ అన్నిటిని ఆఫ్ చేసి వరండాలోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలియజేయాలి.జనసేన-తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అతి త్వరలోనే జనసేన నుంచి ఐదుగురిని, టీడీపీ నుంచి ఐదిగురిని ఎంపిక చేసి ఈ కమిటీ ద్వారా క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలనీ నిర్ణయం తీసుకున్నాం.

ఇప్పటికే మండల, గ్రామ, నియోజికవర్గ స్థాయిలో జనసేన-టీడీపీ కలిసి పని చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నం పర్యటనలో టీడీపీ శ్రేణులు, నాయకులు పాల్గొని పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.గత నాలుగు సంవత్సారాల నుంచి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడే స్వేచ్ఛ, హక్కు ఈ రాష్ట్రంలో లేదు. మాట్లాడని వాళ్ళ పై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన కూడా వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలన్ని చెప్తున్నా కూడా ఇంకా పిచ్చెక్కి అక్రమ కేసులు పెడుతున్నారు.

ఈ రోజు జరిగిన సమావేశంలో కేసుల మీద కీలకంగా చర్చించాం. పార్టీ తరుపున లీగల్ గా అందరికి సహాయసహకారాలు అందిస్తున్నాం. నీటి పారుదల ప్రాజెక్టుల పైన అంగళ్లు పర్యటనకు చంద్రబాబు గారు వెళ్ళేటప్పుడు మా పైనే దాడులు చేసి, మా మీదే హత్య ప్రయత్నం చేసి మా నాయకుడి పైన, వందలాది కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టి రెండు మాసాల నుంచి జైలు లో పెట్టారు. వారికి కూడా పార్టీ తరుపున లీగల్ గా సహకరించటంతో వారు నిన్న బెయిల్ పై విడుదలయ్యారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా… ఎవరు భయపడకండి. మన పోరాటాన్ని కొనసాగిద్దాం . ఎవరి మీద అయితే అక్రమ కేసులు పెట్టారో వారి అందరికి పార్టీ తరపున లీగల్ గా సహకరిస్తాం.ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు అన్ని కూడా అక్టోబర్ 3 వరకు కొనసాగించాలని పీఏసి మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం. జగన్ రెడ్డి కావాలని నా పై అక్రమ కేసు పెట్టి జైలు లో పెట్టారు.నా మీదే కాదు ఎంతోమందిపై అక్రమ కేసులు పెట్టాడు. వైసీపీ అక్రమ కేసులన్నీ ఎదుర్కొవాలని నిర్ణయంతీసుకున్నాం.ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తున్నాం.

అన్ని పార్టీలతో పాటు, ప్రజాసంఘాలు, మహిళాసంఘాలతో పాటు తటస్థులు కూడా ముందుకు వస్తున్నారు.చరిత్రలో ఎంతోమంది నాయకులు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు గారు చేసిన తప్పు ఏంటి? ఈ రాష్ట్రాన్ని బాగు చేయటమా? మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించటమా? సంక్షేమ పథకాలు ఇవ్వటమా? ప్రతి ఒక్క పౌరుడు, తెలుగు వాడు ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలని రోజుకు 18గం పనిచేయటం ఆయన చేసిన తప్పా? విచిత్రమైన కేసు పెట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా ఊహాజనితంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి 22రోజులు అయింది.

22 రోజులు అయినా కూడా ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు. గతంలో ఎప్పుడూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు బయటకి వచ్చిన సందర్భం లేదు. ఒక మహానాయకుడి కోసం ఓఆర్ఆర్ పై ర్యాలీ చేయటం మొదటి సారి. తప్పుడు కేసులు పెట్టడం వైసీపీకి అలవాటు. 22 రోజుల నుంచి బాబుగారు జైలు లో ఉన్నా ఎక్కడా కూడా ఒక్క కార్యక్రమం కూడా ఆగ లేదు. ఎక్కడా పౌరుషం, పోరాటం ఆగలేదు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలిచ్చిన పార్టీ. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒక చంద్రబాబు నాయుడు . లోకేష్ బాబు అరెస్ట్ చేస్తారు అనేది ఒక ఊహాజనితం.ఎన్ని కేసులు పెట్టినా, ఏ రకంగా ఇబ్బంది పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. మేము పోరాటం చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు జరిగిన సరే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపటానికి సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE