సీఎం కేసీఆర్ ఏమయ్యాడో పరేషానీ
జూనియర్ కేటీఆర్ సీఎం అవుతాడేమోనన్న ప్రస్టేషన్‌లో హరీష్ రావు
రైల్వేస్టేషన్‌లో పిచ్చివాడిలా హరీష్ రావు
ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తారు
గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి
సొంత కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్‌కు ప్రమాదం ఉందని అనుమానం కలుగుతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. సీఎం కేసీఆర్ ఎమయ్యాడోనన్న పరేషానీ మొదలైందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకుందన్నారు. కేసీఆర్ తర్వాత సీఎం పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్‌లు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. తనకంటే జూనియర్ కేటీఆర్ సీఎం అవుతాడేమోనన్న ప్రస్టేషన్‌లో హరీష్ రావు ఉన్నాడని… రైల్వేస్టేషన్‌లో పిచ్చివాడిలా హరీష్ చిల్లరగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ దినేష్ కులాచారి , డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి , రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు అర్వింద్ ధర్మపురి మాటల్లోనే …. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డును ప్రకటించారు. అందుకు నేడు భారత ప్రభుత్వం పసుపు బోర్డుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపినందుకు ధన్యవాదాలు.పసుపు రైతుల దశాబ్దాల కల ప్రధాని నరేంద్ర మోదీ గారు నెరవేర్చారు.
పసుపు బోర్డు రావడంతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు.పసుపు బోర్డు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి చూపించాం. పసుపు పంట ఎగుమతులు పెంచేలా ఖ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పై బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా, చిల్లరగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం.
బీఆర్ఎస్ నాయకులకు ఏం మాట్లాడాలో తెల్వని ప్రస్టేషన్ లో ఉన్నారు.కేసీఆర్ కుటుంబంలో సీఎం పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ లు పోటీ పడ్తున్నారు. తనకంటే జూనియర్ కేటీఆర్ సీఎం అవుతాడేమోనన్న ప్రస్టేషన్ లో హరీష్ రావు ఉన్నాడు. రైల్వే స్టేషన్ లో పిచ్చివాడిలా హరీష్ వ్యవహరించడం సిగ్గుచేటు.ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నాడు. రేవంత్ రెడ్డిపై ఎందుకంత ప్రేమ? కేసీఆర్ సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీలోకి నాయకులను కేసీఆరే పంపిస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తారు.. గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్తారు.