Suryaa.co.in

Devotional

దరిద్రనారాయణుడనే ఎందుకంటాము?దరిద్రదేవుడని అనొచ్చుగా!

దరిద్ర నారాయణుడు పేదవాడిని దరిద్రనారాయణుడనే ఎందుకంటారు ? దరిద్రదేవుడని అనొచ్చుగా ! అంటే దరిద్రులు తమ పేదరికాన్ని తొలగించమని నారాయణుడిని సదా ప్రార్థిస్తుంటారు. అలాగే నారాయణుడికి కూడా దరిద్రులంటేనే ఇష్టం. మరి నారాయణుడికి దరిద్రులంతగా ఇష్టమైనప్పుడు వారికి విశేషమైన సంపదలను ఇవ్వవచ్చుగా ? మనిషికి సంపదలొస్తే ఏ విధంగా పరివర్తన చెంది ప్రవర్తనలో మార్పు తెచ్చుకొంటాడో ఆ దేవదేవుడికి తెలుసు. అందుకే వారికి భోగభాగ్యాలపై వైరాగ్యం కలిగించి ముక్తిమార్గంవైపు నడిపిస్తాడా నారాయణుడు. అందుకే పేదవారిని దరిద్రనారాయణులని పెద్దలు పిలిచారు.మన పెద్దలు విధివరాండ్రను గంగాభాగీరథి సమానురాలని పిలిచేవారు. యమున, గోదావరి, నర్మదా సమానురాలని ఎందుకు పిలవలేదంటే.ఎందుకంటే వారు గంగ అంతటిగా పవిత్రులన్నమాట.
శివుడి జటాజూటమునుండి విడివడి భర్తహీనురాలై, పాతాళలోకం చేరి అక్కడునన్న భగీరథ మహముని పూర్వీకులకు ఉత్తమలోకాలను కల్గించి పునీతయైనది.సువాసీనీల అనగా అనాథ స్త్రీలను కూడా మనవారు గంగభాగీరథి సమానురాలని పిలిచేవారు. అంతగా గొప్పగా మర్యాదగా పిలిచిన పెద్దలమాటలను మనం విస్మరించి వీడోలంటూ పిలిచుకొని అవమానిస్తున్నాము.చండశాసనుడంటే తన ఆజ్ఞలను అనగా శాసనాలను కఠినంగా క్రూరంగా అమలుపరిచేవాడని. మీకర్థమైందా ?
వాడిదంతా చాటభారతమంటాము కదా ! చాటభారతమంటే మరి పెద్దపెద్ద అక్షరాలతో గ్రంథాలను ముద్రించడమన్నమాట. పూర్వం ఎవరో ముద్రాపకుడు (ప్రింటర్) చేటంత పెద్దగా భారతగ్రంథాన్ని ముద్రించివుంటాడు, అప్పటి నుండి ఈ మాటలు అమలులోనికి వచ్చింటాయి. చేటను పలికేటపుడు చాట (గ్రామ్యరూపం) అంటాము.చెప్పల్సినదానికంటే అధికంగా చెబితే వాడిదంతా చాటభారతమంటాము.
పంచభక్ష్యాలంటే ఐదురకాలైన తినే పదార్థాలు. అవేవంటే.
భక్ష్యము అనగా మునిపండ్లతో కొరికి తినేవి. ఉదా॥ పండ్లు, కంకులు,అప్పాలు, చెక్కిలాలు, నిప్పట్లు మొదలైనవి.
భోజ్యములు అనగా నోటితోబాగా నమిలి తినేవి. ఉదా॥ అన్నం, చిత్రాన్నం, మాంసం వగైరాలు.
చోష్యములు అంటే నోటిలోపలికి పీల్చుకునేవి. ఉదా॥ పాయసం, రసం, పండ్లరసాలు వంటివి.
లేహ్యములు అనగా నాక్కుని తినేవి.ఉదా॥ తేనె, రకరకాల పాకాలు, పంచామృతం, ఐస్ క్రీములు.
పానీయమంటే త్రాగేటివి. ఉదా॥ నీల్లు, మద్యపానం, చల్లటి పానీయాలు మొదలైనవి.
ఇతమిత్థంగా చెప్పడమంటే ఉన్నదివున్నట్లుగా చెప్పడం. ఇది ఇలాగే వుండేదని చెప్పడం. వాడికి ఇతమిత్థంగా తెలియదంటే యథార్థం ఎలా జరిగిందో చెప్పలేకపోవడం.

॥సేకరణ॥
జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
(హైందవశక్తి సౌజన్యంతో)

LEAVE A RESPONSE