– రాజకీయాల్లో ఆయన ఐరన్ లెగ్
– ఏ పార్టీలో చేరితో ఆ పార్టీ అధికారానికి దూరమైనట్లే
– బండి సంజయ్ ను తిడితే పెద్ద లీడర్ అయిపోదామనుకోవడం దాసోజు మూర్ఖత్వం
– లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద దాసోజుకు గ్రూప్ 1 అభ్యర్థులు చేసిన సత్కారం గుర్తు తెచ్చుకుంటే మంచిది
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దాసోజు శ్రవణ్ రాజకీయ అజ్ఞాని. నిత్యం పార్టీలు మారుతూ ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడే నైజం ఆయనది. దాసోజు పెద్ద ఐరన్ లెగ్. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రానేరాదు.
బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. అక్కడి నుండి కాంగ్రెస్ లోకి అక్కడా అధికారం రాలేదు. ఆ తరువాత మళ్లీ అన్ని పార్టీలు మారి బీఆర్ఎస్ పంచన చేరితే చివరకు బీఆర్ఎస్ కూడా అధికారానికి దూరమైంది. ఇదీ దాసోజు హిస్టరీ. ఇలా ఎన్ని పార్టీల్లో తిరిగావో జనం కూడా లెక్క పెట్టలేకపోతున్నారు. అవకాశవాద రాజకీయం ఆయనది. ఎన్నికల కు ముందు బి ఆర్ ఎస్ వస్తుందేమోనుకుని నువ్వు మళ్లీ బీఆర్ఎస్ కు పోయినవ్. బీఆర్ఎస్ నామరూపాల్లేకుండా పోయింది.
బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రెస్ మీట్ పెట్టి నాలుగు ముక్కలు ఇంగ్లీషులో మాట్లాడితే ప్రజలంతా తమమీద నమ్మకం పెడతారని భావిస్తే అది చాలా హాస్యాస్పదం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 15లో డిపాజిట్ కోల్పోయారు. కేసీఆర్ మహారాష్ట్రకు 600 కార్లతో ప్రచారానికి వెళ్లారు. ఆఖరుకు అక్కడ బోల్తాపడ్డరు.
బీఆర్ఎస్ విసిరే ఎంగిలి మెతుకుల కోసం బండి సంజయ్ ని రేవంత్ రెడ్డే గెలిపించారని విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఇట్లాంటి పిచ్చి కామెంట్లు చేసి ప్రజల్లో జోకర్ గా మిగిలిపోవద్దని సూచిస్తున్నా. నిజంగా.. రేవంత్ రెడ్డి సహకరిస్తే బీజేపీకి 8 కాదు, 17కు 17 ఎంపీ సీట్లు వచ్చేవి కదా…!
బండి సంజయ్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. రెండుసార్లు కరీంనగర్ ఎంపీగా గెలిచారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం ద్వారా దాసోజు పెద్దనాయకుడు అయిపోతాడునుకోవడం ఆయన మూర్ఖత్వం. ఆయన అజ్ఞానమే ప్రజల ముందు మరోసారి బయటపడింది.
దానివల్ల ప్రజలు చీత్కరించుకుంటరు తప్పితే మరేంలేదనే వాస్తవాన్ని గ్రహించాలని దాసోజు శ్రవణ్ కు సూచిస్తున్నా. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన సమయంలో లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరుద్యోగ యువకులు దాసోజు శ్రవణ్ కు చేసిన సత్కారాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది.