Suryaa.co.in

National

యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదు..ఆత్మ శక్తి

– కేంద్రమాజీ మంత్రి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి

డోన్: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డోన్ పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్రమాజీ మంత్రి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ.. “ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం.ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన ప్రతిపాదన మేరకు,ఐక్యరాజ్యసమితి ఈ దినాన్ని అధికారికంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇది మన శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతిని, ఆత్మకు శక్తిని అందిస్తుంది.

ఇప్పటి జీవనశైలిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో యోగా మనకు విశ్రాంతిని, అంతర్గత శాంతిని అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో, సుమారు నాలుగు లక్షల మందితో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, ప్రపంచంలోనే అతిపెద్ద యోగా ఈవెంట్‌గా గుర్తింపు పొందబోతోంది. ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా నమోదు చేసుకోవడం గర్వకారణం.ఈ ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించనుంది. భారతదేశం నెమ్మదిగా యోగాంధ్రగా, అంటే యోగా సామ్రాజ్యంగా మారుతోంది.

మన జీవితాల్లో యోగా ఒక భాగమవ్వాలి. ఇది శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు బలం కలిగించగలదు. అందుకే ఈ యోగా దినోత్సవం సందర్భంలో మనమందరం యోగాన్ని అనుసరించేందుకు ముందడుగు వేయాలి అని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE