కూతురంటే కూడికల
తీసివెతల లెక్క కాదు
నీ వాకిట్లో పెరిగే
‘తులసి మొక్క’…
కూతురంటే
దించేసుకొవలసిన
బరువు కాదు…
నీ ఇంట్లో వెలసిన
‘కల్పతరువు’…
కూతురంటే
భద్రంగా చూడవలసిన
గాజు బొమ్మ కాదు…
నీ కడుపున పుట్టిన
మరో “అమ్మ”…
కూతురంటే
కష్టాలకు,కన్నీళ్ళకు
వీలునామా కాదు …
కల్మషం లేని
‘ప్రేమ’ కు చిరునామా…
కళ్యాణమవగానే
నిన్ను విడిచివెళ్ళినా…
పరిగెత్తుకొస్తుంది నీకు
ఏ కష్టమెచ్చినా…
తన ఇంటి పేరు
మార్చుకున్న
కడదాక వదులుకోదు
పుట్టింటి పైన ప్రేమను…
కొడుకులా
కాటి వరకు
తోడురాకపోయినా…
అమ్మ అయి
నీకు ప్రసాదించగలదు
మరో జన్మ…
కూతురున్న
ఏ ఇల్లు అయినా
అవుతుంది…
దేవతలు
కొలువున్న కోవెల…
కూతురిని కన్న
ఏ తండ్రి అయినా
గర్వపడాలి యువరాణి ని
కన్న మహారాజు లా…
– ఎంబిఎస్ గిరిధర్‌రావు