Suryaa.co.in

Telangana

బీజేపీ తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ

– యాదగిరి గుట్టలో తడిబట్టలతో డ్రామా చేసిన బండి సంజయ్
– ఆ దేవుడే వారికి తగిన గుణపాఠం చెప్పాడు
– ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ దే అని మరోసారి రుజువైంది
– బీజేపీ పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా అర్చకులు, దేవాలయ అధికారులు సిబ్బంది మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు.

ప్రజల్నే కాదు… చివరకు భగవంతుడిని కూడా మోసం చేసిన బిజెపి. దుబ్బాక, హుజురాబాద్ లలో తప్పుడు వాగ్దానాలతో గెలిచారు.ప్రజలు బిజెపి మోసాలను అర్థం చేసుకున్నారు. తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ. యాదగిరి గుట్టలో తడిబట్టలతో డ్రామా చేసిన బండి సంజయ్. బిజెపికి, బండి సంజయ్ కి తగిన శాస్తి జరిగింది. ఆ దేవుడే వారికి తగిన గుణపాఠం చెప్పాడు.

మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బిజెపి, 18వేల కోట్లకు కొనుగోలు చేసింది. మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూసింది. బిజెపి కుట్రలను మా ఎమ్మెల్యేలు తిప్పి కొట్టారు. మునుగోడు ప్రజలు కూడా అమ్మడు పోరని తేల్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరని తేలింది. మునుగోడు ప్రజల ఆత్మగౌరవమే గెలిచింది. బిజెపి, రాజగోపాల్ రెడ్డి అహంకారం ఓడింది. టీఆర్ఎస్ ని, కెసిఆర్ ని, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని బిజెపి చూసింది. బిజెపి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ప్రజలు టిఆర్ఎస్ వైపే నిలిచారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా… ప్రజలు కెసిఆర్ నే కోరుకున్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే బిజెపి కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారు. ఇప్పటికైనా బిజెపికి బుద్ధి కలగాలి. ఆ పార్టీ నేతలకు జ్ఞానోదయం కలగాలి. ఆ భగవంతుడు వారికి ఆ తెలివిని కలిగించాలని కోరుకున్నా. 40 ఏండ్లుగా యాదగిరి గుట్టకు వస్తున్నా. మునుగోడు ప్రచారానికి ముందు వచ్చా. మునుగోడులో ఓట్లు పడటానికి ముందు వచ్చా. మునుగోడు లో మాదే విజయం అని చెప్పా. మునుగోడులో గెలిచాక మళ్ళీ వచ్చాను. మునుగోడు ఎన్నికల విషయంలో బండి సంజయ్ యాదగిరి గుట్టను కూడా రాజకీయం చేశారు. ఆ దేవుడు బిజెపికి తగిన బుద్ధి చెప్పాడు. ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ దే అని మరోసారి రుజువైంది.

కేసీఆర్ సీఎం గా వచ్చిన తర్వాతే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ గారి కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహ స్వామి ని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.

LEAVE A RESPONSE