ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే

54

– అవాకులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు.
– మునుగోడు లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం
– మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు
– నల్గొండలో హ్యాట్రిక్ సాధించాము, తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్ఎస్ వైపే
– ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.. ఇన్ని రోజులు అవక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని అన్నారు.

నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉంటారనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు .ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పారు.. ఆలయంలో స్వామివారి రథం అవసరం ఉన్నట్లు ఆలయ కమిటీ వారు అడిగారని ఇందుకోసం 50 లక్షలతో రథాన్ని ఏర్పాటు చేయిస్తానని వెల్లడించారు.. ఎంతో మహిమగల నీలకంటేశ్వరున్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ తెలిపారు