జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు

– మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తు్న్నారని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నది ఉత్తరాంధ్ర అభివృద్ధికికాదు.. ఉత్తరాంధ్ర భూముల కోసం. మూడున్నర సంవత్సరాల్లో పూర్వపు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి, విశాఖపట్నం, మన్యం, శ్రీకాకుళం లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అవుతుంటే ఎందుకు అడ్డుకట్ట వేయలేదో చెప్పాలి. 32 మంది ఎంపీలున్నా విశాఖ రైల్వే జోన్ ను ఎందుకు సాధించలేకపోయారు?

అదాని డేటా సెంటర్ రాష్ట్రం నుండి ఎందుకు తరలిపోయిందో సమాధానం తెలపాలి. రూ.42 వేల కోట్లకు లెక్కలు లేవని కాగ్ స్వయంగా పేర్కొంది. ఉత్తరాంధ్ర ప్రజల్ని చులకనగా చూస్తున్నారు. అలా చూడొద్దు. వైసీపీ కుట్రలు, కుతంత్రాల తో మోసపోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎన్ని నిధులు ఖర్చు చేశారో ప్రజలకు తెలపాలి. చెప్పుకోవడానికి ఏమీలేక, చేస్తున్న భూకబ్జాలు, లూటీలు, దోపీడీలు, ప్రజలపై వేసిన అధిక పన్నుల భారం, పెంచిన అధిక ధరల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రాంతాల, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తెరలేపారు.

రాజధానిని మార్చే అధికారం మీకు లేదని రాష్ట్రంలోని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మూడు రాజధానులు అనుమతించబడదని తెలిసి కూడా కేవలం మీ రాజకీయ మనుగడ కోసం, రాజకీయ ఉనికి కోసం రాజ్యంగం, కోర్టులు అనుమతించని మూడు రాజధానులు చేయడానికి వీలు లేదని తెలిసి కూడా మాట్లాడుతున్నారు. మంది మాగదులు కేవలం ప్రాంతీయ విబేధాలు సృష్టించాలనే దురాశతో ఉన్నారు.

రాయలసీమకు ఏం చేశారో చెప్పాలి. ఈ మూడున్నర సంవత్సరాల్లో ఉత్తరంధ్రలో సాధించిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఉద్దానం ప్రాంత ప్రజల కడ్నీ సమస్యలను రూపుమాపలేదు. ఆ ఆసుపత్రిని పూర్తిచేయలేదు. వంశధార రిజర్వాయర్ స్టేజ్ 2 నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్ధానం ప్రాంతానికి 630 కోట్లతో ఆప్ షో రిజర్వాయర్ నుంచి తాగునీరు ఇవ్వాలనే పథకాన్ని ఆనాడు ప్రారంభిస్తే దాన్ని నేడు మార్పు చేశారు.

వంశధార బ్యాక్ వాటర్ నుంచి నీరిస్తామని చెప్పి కమీషన్లకోసం కక్కూర్తిపడి పథకాన్ని మార్చేశారు. ఉద్దానంలో మంచినీటి సమస్యను తీర్చలేదు. ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తి తీర్చడానికి అవసరమైన సుజల స్రవంతి కార్యక్రమానికి తట్టెడు మట్టి కూడా వేయలేదు. విజయనగరం జిల్లాలో పతంజలి ఫుడ్ పార్క్, ట్రైబల్ యూనివర్శిటీని మేం ఎర్పాటు చేశాం. బోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు 2700 ఎకరాలు సేకరించి ఇచ్చాం. శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశాం. భావనపాడు ఓడరేవుకు ఆనాడే రూ3,800 కోట్లకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాం. వైసీపీ ప్రభుత్వం కనీసం తోటపల్లి రిజర్వాయర్ లో మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేకపోయింది.

ఉత్తరాంధ్రలో కిడ్నీ ఆసుపత్రిని ప్రారంభించి.. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వంశధార ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1590 కోట్లు ఖర్చు చేస్తే…వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు చేసింది కేవలం రూ.498 కోట్లు ఖర్చు చేశారు.

మూడున్నరేళ్లలో జగన్ రెడ్డి, ఆయన వందిమాగాదుల ఆస్తులు పెరిగాయి గానీ ప్రజల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఉత్తరాంధ్ర జరిగిన 72 వేల భూ రిజిస్ట్రేషన్లలే వైసీపీ భూ దాహానికి నిదర్శనం. 41 వేల ఎకరాలు చేతులు మారాయంటే ఉత్తరాంధ్రలో ఎన్ని దుర్మార్గాలకు వైసీపీ నాయకులు ఒడిగట్టారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. లక్ష కోట్ల ఆస్తులు జగన్ రెడ్డి చెడ్డీ గ్యాంగ్ పరమైన మాట వాస్తవం కాదా? రుషికొండను బోడిగుండు కొట్టింది మీరు కాదా? దసపల్లా భూముల్లో విజయసాయిరెడ్డి కుటుంబీకులు రూ.3 వేల కోట్లు దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా?

బీసీలు అత్యధికంగా ఉన్న ఉత్తరాంధ్రపైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? కాకినాడ పోర్టును, సెజ్ ను విజయసాయిరెడ్డికి ధారాదత్తం చేశారు. విశాఖ మన్యంలో ల్యాటరైట్, బాక్సైట్ తవ్వకాలు చేసుకునేందుకు వైవీ సుబ్బారెడ్డికి అడ్డగోలు అనుమతులిచ్చింది నిజం కాదా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కనీసం తట్టెడు మట్టికూడా వేయని మాట నిజం కాదా?

దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా విశాఖను ఆర్దికరాజధానిగా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దితే దాన్ని గంజాయి కేంద్రంగా జగన్ రెడ్డి మార్చాడు. ఉత్తరాంధ్రకు కేంద్రం అన్యాయం చేస్తుంటే ఉత్తరాంధ్ర నుంచి నలుగురు వైసీపీ ఎంపీలు ఏం గడ్డి పీకుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. మెట్రో రైలును ఎందుకు సాధించలేకపోయారు. కేవలం జగన్ రెడ్డి కేసుల కోసం, లూటీ కోసం, దోపిడీ కోసం ఉత్తరాంధ్ర ప్రజలను బలిపశువులను చేస్తారా?

ఫ్రాక్లింన్ టెపుల్ టన్, లులూ సంస్థలు ప్రక్క రాష్టాలకుపారిపోవడానికి జగన్ రెడ్డి అసమర్ధత కాదా? ఆంధ్ర యూనివర్శిటీని కూడా వదలకుండా భ్రష్టుపట్టించింది మీరు కాదా? ఐఐఎం ఫెట్రోలియం యూనివర్శిటీ, ఫిన్ టెక్ వ్యాలీ, మిలీనియం టవర్స్ లను నిర్మించాం. ఎస్ఐడి ఫ్లైఓవర్ ను 90 శాతం పూర్తి చేశాం. మూడు పారిశ్రామిన సదస్సులు పెట్టి 30 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు చేసుకుంటే వాటిని నాశనం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూమి అభివృద్దికి ఇస్తే 99 శాతం అభివృద్ది చేసిన వారికి, 1 శాతం భూ యజమానికి ఇవ్వడం ఎక్కడైనా ఉందా? ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు మీ పార్లమెంటు సభ్యుడు పాల్పడటం నిజం కాదా? ఇదే షేర్ తో మీ భూములు అభివృద్ది చేసి ఇస్తానంటే మీరు ఇస్తారా జగన్ రెడ్డిగారు? విశాఖ భూ అక్రమాలపై మీరేసిన సిట్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు.

వెయ్యి కోట్ల విలువైన వాల్తేర్ క్లబ్ ను దోపిడీ చేయాలని ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? రూ.300 కోట్ల విలువైన వెంకోజీపాళెం ఆశ్రమాన్ని కబ్జా చేసింది మీరు కాదా? రూ.200 కోట్ల కార్తీకవనం భూములను కబ్జా చేసింది మీరు కాదా? పంచగ్రామాల ఆవ్రమణలు ఇప్పుడు ఎందుకు పెరిగాయి? విశాఖ-చెన్నై పెట్రోల్ కారిడార్ ను ఎందుకు పూర్తి చేయలేకపోయారు. విశాఖలో రూ.80 వేల కోట్లతో ఏర్పాటు కావాల్సిన అదానీ డేటా సెంటర్ ను ఎందుకు తరలిపోయిందో చెప్పగలరా? 10 వేల ఉద్యోగాల కల్పన చేసే లులూ కన్సార్టియం ఎందుకు తరలిపోయింది? కీలకమైన 13 ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చి కనీసం 25 రూపాయలైన విశాఖకు ఖర్చు చేశారా?

ప్రజలకు కష్టమైన పన్నులు కడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిపెడుతుంటే దాదాపు రూ.42 వేల కోట్ల రూపాయలు లెక్కలు చూపకుండా ఖర్చు చేస్తారా? దీనిపై మిమ్మల్ని కాగ్ ప్రశ్నించిన మాట వాస్తవం కాదా? మీ విలాసాలకు, విందులకు ప్రజలు కట్టిన పన్నులు దోచుకుతింటారా? 14, 15 వ ఆర్ధిక సంఘం నిధులు మీరు దోచుకోవడంతో ఉత్తరాంధ్ర సర్పంచులు గ్రామాల్లో క్లోరినేషన్ చేయడం కోసం భార్యల పుస్తులు అమ్ముకుంటున్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?

ఉత్తరాంధ్రకు వచ్చిన బి.ఆర్.జి.ఎప్ (backward Region grant funds) ఏమైనాయి? మూడున్నరేళ్లలో బి.ఆర్.జి.ఎప్ కు వచ్చిన నిధులు ఎన్ని? అవి ఎక్కడకు చేరాయో జగన్ రెడ్డి చెప్పాలి. నక్సలైట్ల ప్రభావిత ప్రాంత అభివృద్ది కోసం వచ్చిన నిధులను ఏం చేశారు? బొత్సా సత్తిబాబు ఖాతాలకు, బలపం ప్రసాద్ ఖాతాలకు వెళ్లాయా? జగన్ రెడ్డి చెప్పాలి. ఈ ప్రాంతాలలో మౌళిక సదుపాయాలకు కేటాయించిన నిధులను బొక్కేస్తారా? గత మూడు సంవత్సరాలకుగాను వెనకబడిన జిల్లాలకు కేటాయించిన రూ..450 కోట్లు ఏమయ్యాయి? మూడు రాజధానులు చేయడానికి రాష్ట్రానికి అధికారం లేకపోయిన ఆపేరుతో ఎందుకు ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు?

మీ ధనదాహానికి, మీ దోపిడీకి ఉత్తరాంధ్రకు కేటాయించిన నిధులను బొక్కేస్తారా? ఈ నిధులు కాజేయడానికి మీకు సిగ్గులేదా? అని ప్రశ్నిస్తున్నాను.విశాఖపట్టణంలోని పేదల భూములు అప్పణంగా కాజేస్తున్నారే ఇది న్యాయమేనా? జగన్ అన్న కొడుకు, జగన్ బంధుగణం రాబందుల్లా పీక్కుతింటున్నారు. ఇది సబబేనా?జగన్ రెడ్డి…! ఇందుకేనా మా ఉత్తరాంధ్ర ప్రజలు నీకు నాలుగురు పార్లమెంట్ సభ్యుల్ని, 30 మంది శాసనసభ్యుల్ని గెలిపించి పంపారు. ఆనాటి ఒప్పందం ప్రకారం ఈ కాంట్రాక్టు విలువ 700 కోట్లుగా పేర్కొంటే 8,400 చదరపు అడుగుల్లో నిర్మించే 135 విల్లాలపై 1690 కోట్లుగా 700 కోట్లు ఎక్కడ? 1690 కోట్లు ఎక్కడ? అదనంగా మీరు వెయ్యి కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు.

దీనికంతటికి కూడా జగన్ పేషి శ్రీకాకుళం జిల్లా పలాసలో రైతులకు చెందాల్సిన భూముల్ని ఇనాముయాక్టు ప్రకారం భూ యజమానులకు చెందాల్సిన భూముల్ని ధనుంజయరెడ్డి 15 వేల ఎకరాలు కాజేశారు. ముఖ్యమంత్రి పేషీలో కూర్చొని చేసే పనులు ఇవా? దీనికోసమా మీకు ఐఏఎస్ ను అటాచ్ చేసింది? నేడు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. ధనుంజయరెడ్డి దగ్గరుండి నడిపిస్తున్నాడు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషాను బదిలీ చేసింది వాస్తవంకాదా? రేడియం సంస్థ జీవీఎంసీకి వేకండ్ ల్యాండ్ ట్యాక్సు ఆరున్నర కోట్లు కట్టాలి. నాలా పన్నుల కింద 20 కోట్లు చెల్లించాలి. అవేవీ చెల్లించకుండానే భవనాల అమ్మకాలకు సిద్ధమయ్యారంటే ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండా వారు ముందుకు వెళ్లగలరా?

జగన్ మోహన్ రెడ్డి అండ్ కో భూముల్ని దోచేస్తున్నారు. ఈ రేడియంట్ ఒప్పందం ఒక మచ్చు తునక. జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా మీ నాటకాలు ఆపాలి. మీ బూటకపు మాటలు కట్టిపెట్టాలి. మీ కుట్రలు, కుతంత్రాలకు పుల్ స్టాప్ పెట్టాలి. ఉత్తరాంధ్ర ప్యాకేజీని ఉత్తరాంద్రకు సాధించాలని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ డిమాండ్ చేశారు.

Leave a Reply