– ఉద్యోగ సంఘం డిమాండ్
– కోవిడ్ కారణంగానే కాకుండా, ఏ కారణం చేత మరణించినా ఆ ఉద్యోగి కుటుంబంలో అర్హులైన సభ్యులకు నవంబర్ 30 లోపు ఉద్యోగం కల్పించాలి: బొప్పరాజు, వైవీ రావు
– నవంబర్ 30 లోపు కారుణ్య నియామకాలు కలిపించమని ప్రభుత్వం ఇచ్చిన మెమోకు బదులు కొన్ని సవరణలతో వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వ ఉత్తర్వులు అవసరం… బొప్పరాజు, వైవీ రావు
– మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు నెలల తరబడి తిరిగి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలి: బొప్పరాజు, వైవీ రావు
– 27 వ తారీకు జరిగే ఉద్యోగ సంఘాల సమావేశానికి ముందే 11వ prc నివేదిక బహిర్గతం చేయాలి: బొప్పరాజు, వైవీ రావు
ఇటీవల ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు, కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబం నుండి అర్హులైన కుటుంబ సభ్యలకు నవంబర్ 30 లోపు కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కి AP JAC అమరావతి పక్షాన ధన్యవాదములు తెలియచేస్తున్నాము.
కానీ ఈ సందర్భంగా తెలియచేయునది ఏమనగా, ముఖ్యమంత్రి సదుద్దేశంతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో (ప్రత్యేకంగా కోవిడ్ కారణంగా ఎక్కువ సంఖ్యలో మరణించారు కనుక) వారి కుటుంబంలో అర్హులైన సభ్యలకు నవంబర్ 30 వ తారీకు లోపు ఒక “మిషన్ మోడ్” లో ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావించగా, ఉన్నతాధికారులు ఇచ్చిన మెమో లో మాత్రం, కేవలం కరోనా “కారణంగా చనిపోయిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రస్తుతం కారుణ్య నియామకాల నిబంధనల మేరకు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించమన్నారు” . దీనివల్ల కొత్తగా ప్రయోజనం లేకపోగా, కరోనా కన్నా ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల వాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కేవలం కరోనా కారణంగా చనిపోయిన ఉద్యోగ కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత కాకుండా, వివిధ కారణాలచేత చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా, అనేకమంది కారుణ్య నియామకాలు పొందక ఈ రాష్ట్రంలో అనేకమంది ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకంగా ఈ క్రింద తెలిపిన అనేక సమస్యలు ఉన్నందున తీవ్ర జాప్యం జరుగుతోందని కనుక ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ (GAD) ద్వారా ఇచ్చిన Circular Memo No.1512950/Ser.A/2021, dt.21.10.2021 కు “వన్ టైం సెటిల్మెంట్” ఈ కింద తెలిపిన కొన్ని సవరణలు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు తగు ఇవ్వాలని AP JAC మరియు AP JAC అమరావతి పక్షాన కోరుతున్నాము…
1) తక్షణమే సంబంధిత అధికారులు శాఖల వారీగా చనిపోయిన ఉద్యోగుల వివరాలు వెంటనే తెప్పించుకోవాలి.
2) జిల్లా కలెక్టర్ ఆమోదంతో సంబంధం లేకుండానే, అవసరమైన శాఖలో సూపర్న్యూమరరీ పోస్టులు create చేసుకునే అధికారం సంబంధిత శాఖ అధికారులకే కలిపించాలి.
3) ఆయా వారి కేటగిరీ కి సంబంధించిన ఖాళీ లేనప్పుడు, వేరే కేటగిరీ వారి ఖాళీలో నింపి, తర్వాత వచ్చే ఖాళీని తిరిగి వారికి కేటాయించే వెసులుబాటు కలిపించాలి.
4) No Property Certificate, No Earning Member తదితర సర్టిఫికెట్లు కొరకు వేచి చూడకుండా, ఆ కుటుంబాన్ని ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టకుండా, ముందు ఉద్యోగం కలిపించే విధంగా తగు సరణలతో ప్రస్తుతం ఇచ్చిన ప్రభుత్వ మెమో స్థానంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఈ సందర్భంగా మీకు ఉదాహరణలు చెప్పాలంటే ….
APSRTC లో 2016 నుండి దాదాపు 500 మంది పైచిలుకు కారుణ్య నియామకాల కొరకు గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.
అలాగే…ఇప్పటికే టీచర్ కేటగిరీలో షుమారు 750 మందికి పైగా కారుణ్య నియామకాల కొరకు ఎదురు చూస్తున్నారు.
పైన తెలిపిన ఇబ్బందులను అధిగమించే విధంగా, వన్ టైం సెటిల్మెంట్ క్రింద ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మెమో స్థానంలో ప్రభుత్వ వుత్తర్వులను ఇవ్వాలని, తద్వారా ముఖ్యమంత్రి కోరుకున్న ఆశయం నెరవేరుతుందని కోరుతున్నాము.
27/10/2021 న చీఫ్ సెక్రటరీ ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ముందే 11 వ PRC నివేదిక ప్రతులను అన్నీ సంఘాలకు అందజేయాలి.
ఉద్యోగులు తమ అవసరాలకోసం దాచుకున్న డబ్బులు (APGLI, GPF) గత కొద్ది నెలలుగా రానటువంటి పరిస్థితులు, అలాగే మాకు రావలసిన పోలీస్ డిపార్ట్మెంట్ సరండర్ లీవ్ లు, మెడికల్ రిఎంబర్స్మెంట్ చెల్లింపులు రాక ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా డబ్బులు మాకు కొన్ని నెలలుగా చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం తెలపాలి. వెంటనే మాకు రావాల్సిన అన్నీ బిల్లులు విషయాలు ముఖ్యమంత్రి దృషికి తీసుకుని పోయి, ఫైనాన్స్ శాఖ అధికారులు తక్షణమే చొరవ తీసుకొని క్లియర్ చెయ్యాలి.
AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై వి రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాద యాత్ర లో ఇచ్చిన హామీ మేరకు, CPS రద్దు విషయంలో ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని వేసిన కమిటీలు కూడా నివేదికలు ఇచ్చినప్పటి, ఏరకమైన నిర్ణయం తీసుకోకపోవటం చాలా బాధాకరం. వెంటనే జరగబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నాటికి ప్రభుత్వం CPS రద్దు చేసి OPS పెన్షన్ ప్రకటించాలని కోరారు.
EHS ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కు ఏవిధంగానూ ఉపయోగంగా లేదు అని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు, అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే హాస్పిటల్ యాజమాన్యాలతో, CEO గారితో, ఉద్యోగ సంఘాల తో ఒక వారంలో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలుకు నోచుకోలేదు. వెంటనే ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేసి EHS వలన వుత్పన్నమవుతున్న సమస్యలు పరిష్కరించాలి. .
AP JAC పశ్చిమ గోదావరి జిల్లా ఛైర్మన్ హరనాథ్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. వేలాదిమంది కాంట్రాక్ట్ సిబ్బంది ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు వెంటనే ఇచ్చిన హామీ కు కట్టుబడి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధికరించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు సమానపనికి సమానవేతనం ఇవ్వాలని కోరారు.
AP JAC అమరావతి, పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ మాట్లాడుతూ… ఇరు JAC లు ఒక వేదిక మీదకు వచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడానికి ఎలాంటి పిలుపునిచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు DS కొండయ్య, AP NGOs అసోసియేషన్, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, APRSA జిల్లా కార్యదర్శి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.