– పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు.
ఎల్లప్పుడూ ఆత్మీయంగా పలకరించే వ్యక్తి ఇక లేరు అనే వార్త ఆందోళనకు గురి చేసింది. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువ చేయడానికి చేసిన కృషి అనిర్వచనీయం. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పని చేస్తూ, చివరిక్షణం వరకు కూడా పార్టీ కోసమే ఆలోచించే అరుదైన నాయకుడు గుంటుపల్లి నాగేశ్వరరావు.
సామాజికంగా తమ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే, వారి అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయం. అలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.