Suryaa.co.in

Telangana

317 జీవో బాధిత ఉద్యోగుల శాశ్వత పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం

– తుది నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కి నివేదిస్తాం
– 317 జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దు
– మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి

హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జీవో. 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీవో నెంబర్ 317 ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ కృషి చేస్తుందన్నారు.

ఉద్యోగుల స్థానికత, ప్రెసిడేన్షియల్ ఆర్ఢర్, జిల్లాల విభజన, జోన్ మరియు మల్టీజోనల్ , స్పౌజ్ బదిలీల అంశాలపై జీవో. 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. పలు సూచనలను, ప్రతిపాదనలను మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి దృష్టికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీసుకొచ్చారు. మంత్రి దృష్టికి తీసుకవచ్చిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు.

బాధిత ఉద్యోగ, స్పౌజ్ బదిలీ లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. జీ వో 317 బాధితుల సమన్వయ కమిటీ ప్రతినిధులు ప్రతిపాదించిన పలు అంశాలపై చర్చించి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. 317 జీవో పై బాధిత ఉద్యోగుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలో తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.

సమస్యల పరిష్కారంపై క్యాబినెట్ సబ్ కమిటీ తుది నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి నివేదిస్తామన్నారు. 317 జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దుని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.

LEAVE A RESPONSE