Suryaa.co.in

Andhra Pradesh

వర్షాకాలంలో వర్షపు నీరు నిలబడవా?

– ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించిన డిప్యూటీ స్పీకర్ కోన
ప్రజల కోసం గతంలో మనం ఏదైనా మేలు చేసి ఇప్పుడు మీరు చేయటం లేదని ప్రశ్నించటం సబబు. అసలు మీరు ఏమీ చేయకుండా,అరకొర గా కొన్ని చేసి, వాటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేయకుండా అలాగే వదిలేసి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చి ఇల్లు కడుతుంటే ఓర్చుకోలేక అత్యంత దిగజారుడు ఆరోపణలు చేయటం సమంజసం కాదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రతిపక్షాలను సూటిగా విమర్శించారు. వర్షాకాలంలో లో వర్షం నీరు నిలబడకుండా ఉంటాయా?
నా చిన్నప్పుడు మా ఇంటి ముందు కూడా అడుగున్నర లోతు నీళ్ళు నిలబడేవి. వాటిలో కాగితాలు పడవలుగా చేసి ఆడుకునే వాళ్ళము. తర్వాత నీరు ఇంకి పోయేవి.బాపట్లలో లబ్ధిదారులు అద్భుతంగా ఇల్లు కట్టుకుంటుంటే చూసి ఆనంద పడాలి కానీ విమర్శలు చేయటం సమంజసం కాదు. గత ప్రభుత్వ హయాంలో విలేకరులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కూడా కనీస వసతులు కల్పించలేక పోయిన టిడిపి పార్టీ,


ఇప్పుడు జగనన్న కాలనీ లో జరుగుతున్న పనులను చూసి ప్రాథమిక స్థాయిలోనే విమర్శలు చేయటం వారి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకొని బాపట్ల లో జరుగుతున్న అభివృద్ధిని అభినందిస్తూ ఇంకా మనం ఏవిధంగా అభివృద్ధి చేసుకోగలము దానిపై సలహాలు ఇవ్వండి కానీ, బాపట్లలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే ప్రజలు చాలా ఆలోచన కలిగిన వారు అని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రతిపక్షాలను హెచ్చరించారు.

LEAVE A RESPONSE