Suryaa.co.in

Telangana

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. కార్పొరేటర్లు, తెరాస మహిళా ప్రతినిధులు, స్థానిక మహిళలతో కలిసి ఉప సభాపతి  పద్మారావు బతుకమ్మ ఆడి312A4708 సందడి చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించిన పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా సంస్కృతికి బతుకమ్మ వేడుకలు దర్పణం పడతాయని అన్నారు.  స్థానిక  సితాఫలమండీ  కార్పొరేటర్ కుమారి సామల హేమ, మెట్టుగూడ కార్పొరేటర్  రాసురి సునిత  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE