-27 మందితో జాబితా విడుదల
-జాబితాను ఫైనల్ చేసిన సీఎం వైయస్.జగన్
-విస్తృతంగా మండలస్ధాయి, నియోజకవర్గస్ధాయిలో నేతలు, -ఎమ్మెల్యేల అభిప్రాయసేకరణ తర్వాతే జాబితా విడుదల : మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: సామాజిక సమీకరణాలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల జాబితాను రూపొందించామని మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.నియోజకవర్గ ఇన్‌ఛార్జీల జాబితాను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మండల, నియోజకవర్గస్ధాయి నేతలతో పాటు, ఎమ్మెల్యేల అభిప్రాయసేకరణ తర్వాతే జాబితాను విడుదల చేశామన్నారు.
గెలుపే ప్రామాణికంగా తీసుకుని 27 మంది ఇన్‌ఛార్జీలతో రెండో జాబితాను విడుదల చేస్తున్నామన్నారు. ఈ జాబితాను పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్.జగన్ ఫైనల్ చేసినట్లు తెలిపారు. సామాజిక సమీకరణాలు, ప్రజల ఆదరాభిమానాలు, అంతిమంగా పార్టీ గెలుపే లక్ష్యంగా జాబితాను రూపొందించామన్నారు. ఒకవైపు మా పార్టీలో గెలుపే లక్ష్యంగా ఈ కసరత్తు చేశామన్నారు. మా పార్టీ శ్రేణుల్లో భారీ విజయాలు సాధిస్తామన్న విశ్వాసం కనిపిస్తుండగా.. ప్రతిపక్షంలో పూర్తి అయోమయ వాతావరణం నెలకొందన్నారు. పొత్తులు తేల్చుకోలేక, సీట్ల పంపిణీ చిక్కుముడులు వీడక.. నియోజకవర్గాల్లో అభ్యర్ధులే లేక నిరాశలో కొట్టు మిట్టాడుతున్నాయన్నారు.
ఇవాళ విడుదల చేసిన జాబితాలో ఎవరికైతే అవకాశాలు దక్కలేదో వారిని పార్టీపరంగానూ, ఇతరత్రా వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. పార్టీ అన్నిరకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 175 స్ధానాల్లో గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని… ఆ దిశగానే ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.