Suryaa.co.in

Andhra Pradesh

పసుపు జెండాతోనే దళితులకి అభివృద్ధి

– దళిత ప్రతిఘటన సదస్సు లో రాష్ట్ర టీడీపీ ఎస్ సి సెల్ అధ్యక్షులు ఎం ఎస్ రాజు

భీమవరం పట్టణంలో ఛాంబర్ అఫ్ కామర్స్ లో నర్సాపురం పార్లమెంట్ దళిత ప్రతిఘటన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర టీడీపీ ఎస్ సి సెల్ అధ్యక్షులు ఎం ఎస్ రాజు పాల్గున్నారు అయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి దళితులకి అడుగడున అన్యాయం చేస్తున్నారని అన్నారు దళితులకి న్యాయం జరిగే వరకు పోరా టం చేస్తామని అన్నారు.

ఈ రాష్ట్రంలో పసుపు జెండా తోనే దళిత అభివృధి జరుగుతుందని అన్నారు. దళిత ప్రతిఘటన రాష్ట్ర సదస్సు మార్చి 25 న విజయవాడ లక్ష మందితో నిర్వహిస్తామని అన్నారు. దాన్ని విజవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు తోట సీత రామలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్ సి లను పూర్తిగా మరచిందని వారికీ రావలసిన నిధులు కానీ అండాల్సిన రుణాలు గాని ఏమి వారికి అందంలేదని ఎస్ సి సబ్ ప్లాన్ ని నిర్వీర్యం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అన్నారు.

మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ, ఈ వైసీపీ ప్రభుత్వం దళితుల వల్ల గెలిచి వారిని ఓటు గా ఓటు వేసే మెషిన్ గా మాత్రమే చూస్తుందని వారి అభివృద్ధికి ఎంతమాత్రం ఆలోచించటం లేదని అన్నారు. దళితులంతా ఏకం కావాలని దళితులకి న్యాయం చేసే టీడీపీకె మనం మద్దతు తెలపాలని అన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు ఆదరణ లేదు. ఈ అప్రజాస్వామిక పాలనలో రాష్ట్రం ఉందని టీడీపీ పార్టీ ఎదురుకుంటుంది అన్నారు.

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఒక్క ఎస్ సి కార్పొరేషన్ ని ముక్కలు చేసి ఒక్క రూపాయి లేకుండ చేసింది అన్నారు. పలువురు టీడీపీ నేతలు దళిత నాయకులు దళితుల పట్ల జరుగుతున్న అన్యాయలను వ్యతిరేకించారు. ఈ కార్యక్రమం లో భీమవరం టీడీపీ ఇంచార్జి వేండ్ర శ్రీనివాస్, మాజీ ఎ ఎం సి చైర్మన్ ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి రాధాకృష్ణ నర్సాపురం టీడీపీ నాయకులు పొత్తూరి రామరాజు ,తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జి బాబ్జి, ఎద్దు ఏసుపాదం, మైలబత్తుల ఐజాక్ పలువురు టీడీపీ నాయకులు దళిత నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE