టీఎన్‌టీయుసి ఆధ్వర్యంలో బిక్షాటన

93

విజయవాడ : తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్( టీఎన్‌టీయుసి ) రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ పార్లమెంట్ టీఎన్‌టీయుసి అధ్యక్షులు సుంకర విష్ణు కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్మికులు అర్ధనగ్నంగా, భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు… ఈ సందర్భంగా టీఎన్‌టీయుసి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన ముప్పై రెండు నెలల్లో రవాణా రంగ కార్మికుల పరిస్థితి రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి వచ్చిందని, దొడ్డిదారిన అక్రమంగా కేసులు. ఈ – చలానా లు పేరుతో వేలకు వేల కార్మికుల దగ్గర నుంచి వసూలు చేస్తూ కార్మికుల నోట్లో మట్టి కొడుతుందని, కార్మిక సమస్యలు పరిష్కరించాల్సిన కార్మిక శాఖ మంత్రి అసలు ఉన్నాడా… ఉంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

నేను ఉన్నాను నేను విన్నాను అన్న ముఖ్యమంత్రి కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే కనీసం పట్టించుకోని ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి రవాణా రంగ కార్మికులు గట్టిగా బుద్ధి చెబుతారని, ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు….

ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పి మాధవ, ఎం ఆదిబాబు, పార్లమెంటు నాయకులు రామరాజు శివయ్య, తంగిరాల కొండ, సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు గరిమెళ్ళ చిన్న, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు గొర్ల గోవిందు, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సురేష్, నేతలు ఆకుల సూర్య ప్రకాష్, బొలిశెట్టి శేషుబాబు, సిహెచ్ దుర్గాప్రసాద్, అశోక్, మొద్దు మధు, శివయ్య, నీలం మధు, నందు, సంతోష్ ,ఆదాము, నాగయ్య ఏసుబాబు ,రాజా ,బాబురావు తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.