Suryaa.co.in

Andhra Pradesh International

అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి

– తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
– న్యూజెర్సీ నగరంలో ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాలు

అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి అని పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. యూ.ఎస్.ఏ.లోని, న్యూజెర్సీ నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యములో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా రెండవ మహానాడును ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎన్.ఆర్.ఐ. తెదేపా యూ.ఎస్.ఏ. కో-ఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షత వహించారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్వీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ రంగస్థల నటులు, నాటక అకాడమీ మాజీ

ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమము, జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించాలన్నారు. ప్రచార సాధనాల్లో భాగమైన సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ తదితర సాధనాల ద్వారా ప్రజలనుtdp-nri చైతన్య పరచాలన్నారు. అసమర్థ, అవినీతి, నిరంకుశ పరిపాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమైనది. ఈ విపత్కర పరిస్థితులలో పార్టీ మరింత బలోపేతానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మనందరం కార్యోన్ముఖులు కావాలన్నారు.

అమెరికాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో జయరాం కోమటి విశేష కృషి చేస్తున్నారు. పార్టీని మరింత పటిష్ట పరుచుతూ 2024 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. రాజకీయాలలో జయాపజయాలు రాత్రి, పగలు వంటివి. అవి ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. వాటిని ఎవరూ ఆపలేరు. దుష్టశక్తుల గ్రహణం తొలగి తెలుగుదేశం దశ, దిశలా వ్యాప్తి చెందుతూ ఉన్నది. ప్రజా బలంతో రాజకీయ కుట్రలు, మానసిక దాడులు తట్టుకుని నిలబడింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనన్నారు.

ఎన్.ఆర్.ఐ తెదేపా యూ.ఎస్.ఏ. కో-ఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాష్ట్రంగా అగ్రభాగాన నిలబడింది అంటే అది తెలుగుదేశం వేసిన బలమైన పునాదులే. ఆ పునాదులను కదలకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బోస్టన్-మహానాడు అభినందనలు, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, అరాచక ఆంధ్రప్రదేశ్- కక్ష సాధింపు చర్యలు, అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి , పార్టీ నిర్మాణం- సభ్యత్వ నమోదు తీర్మానాలను గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.

చివరగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రముఖ రంగస్థల నటులు, నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర పార్టీnri1 ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు ప్రసంగించారు. ఎన్.ఆర్.ఐ సభ్యులు రాధాకృష్ నల్లమల, విద్యా గారపాటి, శ్రీరాం ఆలోకం, రమేష్ నూతలపాటి, రవి పొట్టూరి, భాను మాగులూరి, శ్రీనివాస్ యెండ్లూరి, గర్నె వెంకట రమణ, రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE