-మా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు
– త్వరలో హైదరాబాద్‌లో మాలల భారీ బహిరంగ సభ
– ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి
– కేబినెట్ విస్తరణపై పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
మానకొండూర్ : మా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్ అన్నారు. కాకా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవిపై హామీ లభించింది. కానీ నాకు మాలల అభివృద్ధి, హక్కులు ముఖ్యం. మంత్రి పదవి కాదని వివేక్ అన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీల ఐక్యత కోసం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర మానకొండూర్ చేరుకుంది. ఆయన పాదయాత్రకు వివేక్ సంఘీభావం తెలిపారు. మాలల ఐక్యతను చాటుదామని, త్వరలో హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో మాలల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు అందరూ రావాలని పిలుపునిచ్చారు. దళితుల్లో ఉపకులాలు ఎక్కువగా ఉన్నాయని, వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.