– తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మైలవరం: జగన్ మాటల్లో అంత విశ్వసనీయత నేతి బీరకాయలో నెయ్యంత.వైసీపీ జగన్ ప్రభుత్వం తన అసమర్థ పరిపాలన వైఫల్యంతో ప్రజలను పీక్కుతింటున్నాడు. రూ.720 కోట్ల భారం అని చెప్పి.. ఇప్పుడు ఏకంగా రూ.1500 కోట్ల మేర భారం వేసేశారు. పెంచిన ఆర్టీసీ ప్రయాణ చార్జీల విషయంలో సీఎం చిన్నాన్న మల్లికార్జున రెడ్డి (ఆర్టీసీ ఛైర్మన్) చెప్పిన వివరాలకూ, ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలకూ మధ్య పొంతనే లేదు.
ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నట్టు చైర్మన్, ఎండీ ఉమ్మడిగా ప్రకటించారు. చివరకు డీజిల్ సెస్‌తో పాటు కిలోమీటరు లెక్కన కూడా ప్రయాణికుడిని బాదేశారు. పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సుల్లో టిక్కెట్‌పై రెండు రూపాయలు మాత్రమే విధిస్తున్నట్లు చెప్పి రూ.15లు పెంచారు.
కిలోమీటర్లను బట్టి చార్జీలు పెంచడంతో ప్రజలపై తీవ్రభారం పడింది.ఆర్టీసీ డ్రైవర్లకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావడం లేదు.పోలీసు ఉద్యోగస్తులకు పీఆర్సీ సుమారు 2లక్షల భారం పడుతుంది.
ప్రధాన ప్రతిపక్షంగా ఈ సమస్యలను మీడియా సాక్షిగా ప్రజలకు చెప్తుంటే జగన్ పచ్చమీడియా అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, రామోజీరావు గారిని, రాధకృష్ణగారిని నాయుడు గారిని తిట్టలా అంటూ కాలక్షేపం చేస్తున్నాడు.
వైసీపీ పాలన వారానికోసారి బాదుడే బాదుడుగా మారిపోయింది..వారానికోసారి చార్జీలు పెంచడమో, పన్నులు బాదడమో అలవాటుగా మారిపోయింది.ఇప్పటికే కరెంటు చార్జీలు, చెత్త, ఆస్తి పన్ను వంటి వాటిని బాదారు… నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు.
రాష్ట్రంలో పెట్టుకునే విసనకర్రల పరిశ్రమలు వస్తున్నాయి… ఇన్వర్టర్లలో 15వేల కోట్ల వ్యాపారం జరుగుతుంటే దానిపై వెయ్యి కోట్లు సకల శాఖా మంత్రికి తాడేపల్లి రాజప్రసాదానికి డబ్బులు వెళ్తున్నాయి.. ఇసుకలో తైలం తీయ్యడమంటే ఇదే. రైతుకు రెండు మూడు గంటలు కూడా కరెంటుకు దిక్కులేదు.
ధాన్యం డబ్బులు మూడువేల కోట్లు రావాలి వాటికి దిక్కుమొక్కు లేదు.బియ్యం ఇవ్వకుండా డబ్బులిస్తామని జిల్లాల్లో ట్రయిల్ వేస్తున్నారంట… మరి 500కోట్లు పెట్టి డబ్బా బండ్లు ఎందుకు కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు వచ్చాయని కొందరి రాలేదని కొందరు ఏడుస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ లేదని ఒక పిల్లవాడు చెప్పాడు..అమ్మఒడి ఎగ్గొట్టడానికి 300 యూనిట్ల బిల్లు వచ్చిందని సచివాలయం నోటిసీ బోర్డులో పెట్టారని ఒక ఆడకూతురు చెప్పింది. వీళ్ల పాపాలు, మోసాలు అన్నీ చెప్పాలనే గొల్లపూడి నుండి మైలవరం వరకు బస్సులో వచ్చాము