Suryaa.co.in

Andhra Pradesh

అసమర్థ ముఖ్యమంత్రి, బుద్ధిలేని ప్రభుత్వం వల్లే పోలవరానికి గ్రహణం

– 28మందిఎంపీలను చేతిలోఉంచుకొనికూడా, రూ.55.548కోట్ల ప్రాజెక్ట్ అంచనాలను ఆమోదింపచేసుకోలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు
• 34నెలల పాలనలో ప్రాజెక్ట్ నిర్వాసితుల్లో ఎందరికి ఎన్నిలక్షలుఇచ్చాడో ముఖ్యమంత్రి చెప్పాలి?
• ఎన్ని నిర్వాసిత కాలనీలునిర్మించి, ఎందరికి ఇళ్లుకట్టించాడో స్పష్టంచేయాలి.
• టీడీపీప్రభుత్వంలో నిర్మించిన ఇందుకూరుపేట నిర్వాసితకాలనీని, తానుకట్టానని జగన్ రెడ్డి సిగ్గులేకుండా నిన్నకేంద్రమంత్రికి చెప్పుకున్నాడు.
• ప్రాజెక్ట్ ఎత్తుతగ్గించకుండా పూర్తిచేసి, 194 టీఎంసీలనీటిని ఎప్పుడునిల్వచేస్తున్నాడో జగన్ రెడ్డి సమాధానంచెప్పాలి.
• నిర్వాసితులకుఎప్పటిలోగా లక్షఇళ్లునిర్మించి ఇస్తున్నాడో కూడా చెప్పాలి.
• ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనువిన్నాను..నేను ఉన్నాను అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాకకూడా అదే డైలాగ్ చెబితేఎలా?
• నేను చేస్తాను..నేనుపూర్తి చేయిస్తాను..అనే మాట ముఖ్యమంత్రి నోటినుంచి రాదేం?
– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.

టీడీపీహాయాంలో చంద్రబాబు నాయకత్వంలో నిర్మించిన ఇందుకూరుపేట నిర్వాసితకాలనీ, తాడువాయిప్రాంతంలో గిరిజను లకు నిర్మించిన నిర్వాసితకాలనీల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రితోకలిసి పర్యటించాడని, ఆసమయంలో తన అధికారులకు ముందే ట్రైనింగ్ ఇచ్చి, అంతాతానే చేసినట్టు గిరిజనులతో చెప్పించుకోవాలన్న ముఖ్యమంత్రి ఆశ నిరాశే అయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపా రు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

అధికారంలోకి వచ్చి 34నెలలు అవుతున్నా, పోలవరం నిర్మాణం పై ఈ ముఖ్యమంత్రి, మంత్రులు పూటకొక అబద్ధం, రోజుకో అస త్యం చెబుతూ కాలయాపనచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ డిసెంబ ర్ 2021 నాటికి పూర్తవుతుందని శాసనసభలో, బయటా ఉత్తర కుమారప్రగల్భాలు పలికిన ఇరిగేషన్ మంత్రి అడ్రస్ లేడు. అతని పరిస్థితి అలాఉంటే, నిన్న ముఖ్యమంత్రేమో, కేంద్రమంత్రిని పక్కన పెట్టుకొనికూడా కేంద్రప్రభుత్వం ఆమోదించాల్సిన డీపీఆర్ 2పనుల ఆమోదంపై మాట్లాడలేదు. గతంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధిం చి జరిగిన పనులు కేంద్రమంత్రికి చెప్పడంగానీ,తాను ముఖ్యమం త్రి అయ్యాక ప్రాజెక్ట్ పనుల్లో ఏం పురోగతి సాధించాడని గానీ మీడి యావారితో చెప్పలేకపోయాడు.

కేంద్రమంత్రితో కలిసి సంయుక్తం గా మీడియాసమావేశం నిర్వహించలేని అసమర్థస్థితిలో ఈ జగ న్మోహన్ రెడ్డి ఉన్నాడు. గతఏడాది నవంబర్ లోనే కేంద్రఅధికారు లు ప్రాజెక్ట్ కు సంబంధించి తమకుఉన్న అనుమానాలు తీర్చాల ని అడిగినా ఇంతవరకు ఏపీప్రభుత్వం స్పందించలేదు. కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వలేని ప్రభుత్వం, ఎంతటిదద్దమ్మ, చేతగా నిప్రభుత్వమో ఇక్కడే అర్థమవుతోంది.

పోలవరం నిర్మాణపనుల్లో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం 350 అడుగులపాటు గోదావరి గర్భంలోకి వెళ్లి మరీ నిర్మా ణం చేపట్టింది. దాన్ని రికార్డుస్థాయిలో ఎల్ అండ్ టీ సంస్థ జర్మనీ కి చెందిన బావర్ కంపెనీతో కలిసి పూర్తిచేసింది. అలాంటి సంస్థల పనితనం ఈ ముఖ్యమంత్రికి కనిపించడంలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఎదుట అంతర్జాతీయసంస్థలను పిలిచి,పనులు చేయిస్తామ ని గప్పాలు పలుకుతున్నాడు.

ముఖ్యమంత్రి, మంత్రేమో పోలవరం పనులు బాగాబాగా జరిగాయ ని నరంలేని నాలుకలను లబలబలాడిస్తుంటే, నిన్న కేంద్రమంత్రే మో వారిఎదుటనే ప్రతి 15రోజులకోసారి ప్రాజెక్ట్ పనులపై సమీక్ష చేస్తే తప్ప పనులుజరగవని తెగేసిచెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపురోగతికి సంబంధించిన డాష్ బోర్డ్ కూడా ఈ ప్రభుత్వం వద్దలేకపోవడం పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థమవుతోంది.

పోలవరం ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి ఏంచెబుతారు…కేంద్రమం త్రి ఏంచెబుతారని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, ఇన్ ఛార్జ్ మంత్రేమో కారుపెట్టడానికి చోటు లేదని పోలీసులపై రంకెలే శాడు. అదీ ప్రాజెక్ట్ నిర్మాణంపై, దానిపనితీరుపై మీకు, మీ మం త్రులకు ఉన్న చిత్తశుద్ధి.

బహుళార్థసాధకప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి బ్యారేజ్ గా మార్చడానికి కుట్రలు పన్నుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, ఇతరత్రా బ్యూటిఫికేషన్ పనులకోసం ఉపయోగించా ల్సిన రూ.300కోట్లతో తనతండ్రి విగ్రహం పెట్టడానికి సిద్ధమయ్యా డు. జగన్ రెడ్డి. . ప్రాజెక్ట్ ప్రాంతంలో పెట్టాల్సింది నీ అయ్య విగ్రహ మో… నా అయ్య విగ్రహమో కాదు. ఆవిషయం మర్చిపోకు.

సిగ్గులేకుండా టీడీపీప్రభుత్వంలో నిర్వాసితులకోసం నిర్మించిన ఇళ్లను మీరు కట్టామని చెప్పుకుంటారా?మాప్రభుత్వం కట్టిన ఇళ్లు, మేం కట్టామని చెప్పుకుంటారా…మీరు అధికారంలోకి వచ్చాక ఎన్నినిర్వాసిత కాలనీల్లో ఎన్నిఇళ్లుకట్టారో సమాధానం చెప్పగలరా?

పోలవరం నిర్మాణంపై, నిర్వాసితులకు లక్షలు లక్షలు ఇస్తామని చెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడెందుకు మాటతప్పాడు?(టీడీపీ ప్రభుత్వం ఇచ్చే సాయం నిర్వాసితులకు సరిపోవడంలేదని, వారు నిర్మించే ఇళ్లుసరిగాలేవని, తాను అధికారంలోకి వస్తే విశాలమైన ఇళ్లనునిర్మించి, నిర్వా సితులకు ఇవ్వడంతోపాటు, మెరుగైన పరిహారం ఇస్తానని, 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేసి,రైతులకు నీరందిస్తామని జగ న్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంగా దేవినేని విలేకరులకు ప్రదర్శించారు)
డీపీ ఆర్ 2 నివేదికను కేంద్రప్రభుత్వం సమీక్షించి, ప్రాజెక్ట్ అంచనా లకు రూ.55,548కోట్లకుఆమోదం తెలిపింది. కేంద్రంఆమోదించినా కూడా చేతిలో 28మందిఎంపీలను ఉంచుకొని కూడా డీపీఆర్ 2 నివేదికపై ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నిన్న కూడా ఈముఖ్య మంత్రి కేంద్రమంత్రితో వాటర్ కాంపోనెంట్ నిధులతోపాటు, కాలు వల నిర్మాణపనులకుసంబంధించిన నిధులను మినహాయించి, కేవలం రూ.47,725కోట్లు ఇస్తేచాలని కేంద్రమంత్రిని కోరింది నిజం కాదా?

జగన్ రెడ్డి తనస్వార్థప్రయోజనాలు, తనపైఉన్నకేసుల మాఫీకోసం పోలవరాన్ని తాకట్టుపెడుతున్నాడు అనడానికి నిన్న ఆయన కేంద్రమంత్రితో వ్యవహరించిన తీరే నిదర్శనం. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి గతంలో కేంద్రంఆమోదించినట్లుగా రూ. 55,548కోట్లు ఇవ్వాల్సిందేనని జగన్ రెడ్డి, కేంద్రమంత్రి షెకావత్ ను ఎందుకు నిలదీయలేకపోయాడు?

ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం 194 టీఎంసీలప్రకారం 1980 సెంట్రల్ వాటర్ కమిషన్, అప్పటి గోదావరిబోర్డు ఆదేశాలప్రకారం తాము ప్రాజెక్ట్ నిర్మాణంచేసితీరుతామని ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రమం త్రితో చెప్పలేకపోయాడు.

ప్రాజెక్ట్ నిర్మాణం గతంలో అనుకున్న విధంగానే పూర్తిచేస్తాము..మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాల్సిందే నన్న మాట ముఖ్యమంత్రి నోటినుంచి రాలేదు. గట్టిగా నిధుల గురించి అడగాల్సిన ముఖ్యమంత్రి మాకు రూ.800కోట్లు రావాలి. .. అవిరావాలి.. ఇవిరావాలని దేబిరించడంఏమిటి?

చంద్రబాబునాయుడిహాయాంలో జరిగినప్రాజెక్ట్ పనులకు సంబం ధించి కేంద్రంనుంచి రూ.400కోట్లువస్తే, అవితీసుకెళ్లి ఈ ముఖ్య మంత్రి లిక్కర్ కంపెనీలకు చెల్లించేశాడు. పోలవరంలోని జలవిద్యు త్ కేంద్రం పూర్తయిఉంటే 965 మెగావాట్ల విద్యుత్ అందుబాటు లోకివచ్చి ఉండేది. ఆపనిచేయకుండా బయటనుంచి యూనిట్ విద్యుత్ రూ.15కు కొంటున్నాడు ఈచేతగాని ముఖ్యమంత్రి.

జగన్ రెడ్డి మూర్ఖత్వం, అహంకారం, తెలివితక్కువతనమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి శాపంగా మారింది. గతంలో ప్రతి పక్షనేతగా ఉన్నప్పుడుపోలవరం పునాదులే లేవలేదని జగన్ రెడ్డి అన్నాడు. మరిప్పుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మూడుఅంగుళాలపనికూడాచేయకుండా ప్రాజెక్ట్ పనులు 70శాతం ఎలాపూర్తయ్యాయి జగన్ రెడ్డి? పనులే జరగలేదని అబద్ధాలు చెప్పినట్టుతప్పు ఒప్పుకొని జగన్ రెడ్డి ఇప్ప్పుడు చెంపలేసుకుంటాడా?

పోలవరంపనుల్లో రూ.20వేలకోట్ల అవినీతి జరిగిందని గగ్గోలుపెట్టిన జగన్ రెడ్డి అధికారంలోకివచ్చాక రూ.20ల అవినీతినికూడా నిరూపించలేకపోయాడు. పోలవరం ప్రాజెక్ట్ పను ల్లో రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడి రూ.700కోట్లు ఆదాచేశానని చెప్పిన జగన్ రెడ్డి ప్రాజెక్ట్ అంచనాలను అమాంతం రూ.3,500కోట్లకు పెంచేశాడు. జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రా మాలు ఆడకపోతే ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది.

తెలివితక్కువవాడు..చేతగానివాడు పాలకుడు కాబట్టే పోలవరం నిర్మాణానికి గ్రహణం పట్టింది. ప్రాజెక్ట్ పరిధినితగ్గించి, కేవలం 41.15 మీటర్లకు పరిమితంచేసి, నీళ్లునిలబెట్టి ప్రాజెక్ట్ పూర్తిచేశా ను చూడండని డబ్బాలుకొట్టుకోవడానికి జగన్ రెడ్డి తాపత్రయ పడుతున్నాడు. తన తండ్రి విగ్రహంపెట్టేసి, ప్రాజెక్ట్ పూర్తిచేశానని ప్రజల్ని నమ్మించడానికి కుటిలయత్నాలుచేస్తున్నాడు. ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గిస్తే నిర్వాసిత కుటుంబాల పరిస్థితిఏమిటని ముఖ్యమం త్రిని ప్రశ్నిస్తున్నాం. దాదాపు లక్షకుటుంబాలకు ఇంకా ఇళ్లుకట్టా లి…ఈ ముఖ్యమంత్రి ఎప్పుడుకడతాడో లక్షకుటుంబాలకు సమాధానం చెప్పగలడా?

టీడీపీహాయాంలో నిర్వాసితులకు పూర్తిచేసి నిర్మించిన 6,551 ఇళ్లు తప్ప, జగన్ రెడ్డి వచ్చాక వారికోసం ఒక్కఇల్లైనా కట్టాడా? వారికోసం రూపాయి అయినా ఇచ్చాడా? నిర్వాసితులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చేదానికంటే అధికంగా రూ.5లక్షలు ఇస్తానన్న జగన్ రెడ్డి,ఇప్పుడెందుకు ఆమాట మాట్లాడడు? టీడీపీప్రభుత్వం లో తరలించిన 25నిర్వాసితకాలనీలుతప్ప, ఈప్రభుత్వం ఒక్క ప్రాంతంలోని ఒక్కకుటుంబాన్నికూడా తరలించలేదు.

టీడీపీ హాయాంలో నిర్మించిన ఇళ్లు కేంద్రమంత్రికి చూపించి, తాము చేశామనిచెప్పుకోవడానికి ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికి సిగ్గుండాలి.8మండలాలు, 222 రెవెన్యూగ్రామాలు వరద కారణంగా ఎఫెక్ట్ అయితే, ఆయాగ్రామాల్లోని నిర్వాసితులనుఎక్క డికి తరలించి, ఎందరికి ఇళ్లు ఇచ్చారో సమాధానంచెప్పగలరా? మొత్తం నిర్వాసితకాలనీలు 213 వరకుఉంటే, వాటిలో టీడీపీ ప్రభుత్వంలోనే 26కాలనీలనిర్మాణం పూర్తైంది. మిగిలిన కాలనీల నిర్మాణం గురించి ఈముఖ్యమంత్రి ఆలోచించడంలేదు. లక్ష ఇళ్లు ఎప్పుడుకడతాడో సమాధానం చెప్పడు. రూ.550కోట్లు నిర్వాసి తులకు ఇస్తున్నట్లు గతంలో ప్రగల్భాలు పలికాడు… వాటిగురించి నిన్నఎందుకు ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడలేదు?

కేంద్రమంత్రిని పక్కనపెట్టుకొని కూడా ఎప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంపూర్తి చేస్తామనేది జగన్మోహన్ రెడ్డి తేల్చిచెప్పలేకపోయా డు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి వారి అసెంబ్లీలో పోలవరంప్రాజెక్ట్ నిర్మాణంఎత్తు తగ్గించాలని ఏపీ ముఖ్యమంత్రికి చెప్పానంటే, ఈ రాష్ట్రముఖ్యమంత్రి అలాంటిదేమీ లేదని ఇంతవరకు చెప్పలేదు. పొరుగుముఖ్యమంత్రి ఎన్నికలకోసం నిధులిచ్చినందుకు కృతజ్ఞత గా రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరంప్రాజెక్ట్ ఎత్తు తగ్గిం చడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడు.

ప్రాజెక్ట్ మొత్తం నిర్మాణానికి సంబంధించిన నిధులు ఇవ్వమని కేంద్రాన్ని అడక్కుండా, రూ.10వేలకోట్లు ఇవ్వండి..రూ.8వేలకోట్లు ఇవ్వండి అని అడుక్కు నే దుస్థితికిఈ ముఖ్యమంత్రి వచ్చాడు. మీడియాముందు ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయంతోనే ముఖ్యమంత్రి నిన్న కేంద్రమంత్రితో కలిసి మీడియా సమావేశం నిర్వహించలేకపోయా డు. రెండేళ్లక్రితమే తానుప్రాజెక్ట్ ను పరిశీలించి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదికాదని కేంద్రమంత్రి అన్నాడంటేనే ప్రాజెక్ట్ నిర్మాణ పనులుఎలాజరుగుతున్నాయో అర్థమైపోయింది.

గోకవరంప్రాంతంలోని నిర్వాసితులు మొన్నటివరకు పరిహారం కోసం రెండునెలలపాటు ధర్నాలుచేశారు. వారిని నిన్న ముఖ్య మంత్రివద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్ టీడీపీప్రభుత్వంలో నిర్మించి ని ఇందుకూరుపేట నిర్వాసితకాలనీలో గతంలో పర్యటించారు. ఆ కాలనీనే తానునిర్మించినట్లు ఈముఖ్యమంత్రి నిన్నకేంద్రమంత్రికి చెప్పుకున్నాడు. 34నెలల్లో ఎక్కడ ఎన్నికాలనీలునిర్మించి, ఎన్ని ఇళ్లుకట్టాడో ఈముఖ్యమంత్రి ఎందుకు సమాధానంచెప్పలేకపోతు న్నాడు? ఏమైనా కడితేకదా..చెప్పడానికి.

రూ.30వేలకోట్ల వరకు పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిఉంది. ఆ సొమ్ము ఎప్పుడిస్తా డో జగన్ రెడ్డి సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పోలవరం డ్యామ్ ని 150 అడుగులఎత్తులోనిర్మించి, 194 టీఎంసీ ల నీటిని నిల్వచేయాల్సిందేనని కూడా డిమాండ్ చేస్తున్నాం.

లక్షమంది నిర్వాసితులకు ఎప్పుడు ఇళ్లుకట్టిఇస్తాడో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి..అలానే పోలవరం ప్రాజెక్ట్ ను అనుకున్నప్రకారం పూర్తిచేస్తాడా..లేక బ్యారేజ్ కే పరిమితం చేస్తాడా? పోలవరం విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి రూ.960 మెగావాట్ల విద్యుత్ ఎప్పుడు ఉత్పత్తిచేస్తున్నారోకూడా చెప్పాలి.పోలవరం నిర్మాణపనులకు సంబంధించి కేంద్రమంత్రి డాష్ బోర్డ్ ఏర్పాటు చేయమనిచెప్పినదానిపై ముఖ్యమంత్రి ఏం చెబుతారు? ఎప్పుడు డాష్ బోర్డు ఏర్పాటుచేస్తున్నారు?

తమప్రభుత్వలో జరిగిన పను లవివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందించేవాళ్లం. ఇప్పు డలా ఈ ముఖ్యమంత్రి ఎందుకు చేయడంలేదు? పోలవరం నిర్వా సితులకు ఈ ముఖ్యమంత్రి న్యాయం చేయకుంటే, వారితరుపున ఎలాంటిపోరాటం చేయడానికైనా టీడీపీ సిద్ధంగాఉంది.జగన్ రెడ్డి గతంలో చెప్పిందేఇప్పుడు చెబుతున్నాడు..నేను ఉన్నాను..నేను విన్నాను అంటున్నాడు తప్ప, నేను చేస్తాను … నేను చేయిస్తాను అనిచెప్పలేకపోతున్నాడు.

LEAVE A RESPONSE