– వర్ర రవీంద్ర పెట్టిన పోస్టుల మీద నీ దగ్గర సమాధానం ఉందా?
మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు
గొల్లపూడి: ఇటువంటి అరాచక శక్తులను భుజాన వేసుకొని సౌమ్యుడు మంచివాడు అందగాడు అంటూ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని ఈరోజు నువ్వు శ్రీరంగనీతులు చెబుతున్నావా? జగన్ రెడ్డి. నిన్ను నమ్ముకున్న పోలీస్ అధికారులు అంతా కూడా ఈ రోజు బట్టలు ఊడదీసుకుని జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు నాయకులు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్లారు. మంగళగిరి పార్టీ కార్యాలయంపై అరాచక శక్తులని పంపించి అద్దాలు, కార్లు పగలగొట్టి మనుషులపై దాడి చేశారు.
ఒక బీసీ నాయకుడు ఇన్చార్జిగా ఉన్న గన్నవరం నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు పై దాడి చేసి కారులు తగలబెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలను మైనార్టీ వర్గాలపై దాడి చేశారు. సామాన్య ప్రజలపై నీ బ్లేడు బ్యాచ్ దాడులు చేస్తే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని ఈరోజు నువ్వు మాట్లాడడానికి సిగ్గుందా? కృష్ణాజిల్లాలో మహానుభావులు ఎంతో మంది పుట్టిన ఈ గడ్డపై నువ్వు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఫ్యాక్షన్ రాజకీయాలు తలపిస్తున్నాయి.
సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ గుట్కా కొడాలి నాని, వంశి, జోగి రమేష్, రఘురాం, అవినాష్, అనిమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరితో నువ్వు చేయించిన అకృత్యాలు అన్యాయాలు దుర్మార్గాలు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ విజయవాడ వచ్చి డ్రామాలు చేసి నాటకాలు వేస్తావా ? పార్టీ కార్యాలయాలపై దాడులు దగ్గరుండి చేయించిన అధికారులు మీ పార్టీ నాయకులు మీ ప్రజా ప్రతినిధులు ఇవ్వాళ వాళ్ళందరూ కూడా ఊసలు లెక్కపెట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయి.
ఎగిరెగిరి పడుతున్న కొడాలి నాని నీ బూతులు దౌర్జన్యాలు అరాచకాలకు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ బట్టబయలు అవుతాయి. వర్ర రవీందర్ రెడ్డి మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పావా? కుటుంబాన్ని మహిళలను కించపరుస్తూ వర్ర రవీంద్ర పెట్టిన పోస్టుల మీద నీ దగ్గర సమాధానం ఉందా?
సీబీఐ ఈడీ కేసుల్లో నువ్వు తప్పించుకోలేవు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ శిక్షార్హులే.ఎవరైతే పాపాలకు పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద దాడులకు పాల్పడి కార్యకర్తలను గాయపరిచారో అందరూ చట్టం ముందు నిలబడి కటకటాల వెనక వెళ్లాల్సిందే. మీరు చేసిన అరాచకాలు కిడ్నాప్ దుర్మార్గాలే ఈరోజు కటకటాల వెనకు నెట్టాయి అతను నీకు గ్లామరస్ గా అందంగా కనబడుతున్నాడా ?
1.0 లో నువ్వు చేసిన అరాచకాలు బట్టబయలు చేస్తే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు . స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా పత్రాలను లాక్కున్న నీకు దౌర్జన్యం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా? నువ్వు చేసిన దుర్మార్గాలకే కూటమీ ప్రభుత్వాన్ని 164 సీట్లతో గెలిపించారు. ఎన్నికల హామీ ప్రకారం ఇచ్చిన పనులన్నీ కూటమి ప్రభుత్వం చేస్తుంది రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలు ఇచ్చిన హామీలు వాగ్దానాలు చేసి తీరుతారు.