Suryaa.co.in

Telangana

సస్పెండ్ చేసిన హెడ్మాస్టర్ పై చర్యలు నిలిపివేయాలి

– ప్రోటోకాల్ లేని తిరుపతి రెడ్డి ని జిల్లా కలెక్టర్ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికిన అధికారులు
– కెసిఆర్ జన్మదినం పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు జరుపుకుంటే నేరం అవుతుందా?
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం చావును కూడా లెక్క చేయకుండా, సబ్బండ వర్గాలను ఏకం చేసి కేంద్ర పాలకులకు ప్రకంపనలు సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పుట్టిన రోజున మిఠాయిలు పంచితే. హస్తినాపురం డివిజన్ లో పనిచేస్తున్న zphs హెడ్‌మాస్ట‌ర్‌ను స‌స్పెండ్ చేయడం అమానుషం. రాష్ట్రాన్ని, దేశానికి విశేష సేవలు అందించిన ఎందరో మహానుభావుల జన్మదినాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

స్కూల్ సిలబస్ లో ఉన్న మహనీయుల చరిత్రను గుర్తుంచుకొని జన్మదినం జరపడం తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల జన్మదినాలు యధేచ్ఛగా అన్ని ప్రభుత్వ వ్యవస్థలలో జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వానికి కనపడవా? ఎలాంటి ప్రోటోకాల్ లేని తిరుపతి రెడ్డి ని జిల్లా కలెక్టర్ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికిన అధికారులు.. కెసిఆర్ జన్మదినం పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు జరుపుకుంటే నేరం అవుతుందా?

ప్రజలు కేసీఆర్ కి ప్రత్తిపక్ష బాధ్యతలు యిస్తే స‌ర్కార్‌ కెసిఆర్ పేరు ఎక్కడా అనొద్దు అని నిషేధం విధించాలని చూస్తే.. కోట్లాది ప్రజలు గొంతెత్తి జన్మదినం రోజు కెసిఆర్ లాంగ్ లివ్ అనే పదం మార్మోగుతుంటే ప్రభుత్వానికి ప్రకంపనలు ఎందుకు? ఇచ్చిన హామీలు అమలు చేసి పరిపాలన పై దృష్టి పెట్టండి. ప్రతికార పాలన వీడండి. సస్పెండ్ చేసిన హెడ్మాస్టర్ పై చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం, గ్రాడ్యుయేట్ మరియు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల వైఖిరి తెలపాలని కోరుతున్నాం

LEAVE A RESPONSE