Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు

– గురుకుల పాఠశాలలను నడపడం చేతకాని సన్నాసి రేవంత్ రెడ్డి
– రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి ఫికర్ లేదు
– రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు
– రేవంత్ ఇక రేపు మీ పుస్తెలతాడు కూడా ఎత్తుకుపోతడు
– పిల్లనిచ్చిన కల్వకుర్తి ప్రాంతానికి కూడా ఒక్క రూపాయి పని చేయలేదు
– టకీ టకీ మని రైతు భరోసా ఇస్తనని రేవంత్ రెడ్డి గప్పాల్ కొట్టిండు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

అమన్ గల్ : రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు. ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించిన్రన్న కేటీఆర్, ఆ భూముల రేట్లు పెంచుకోవడానికే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని విమర్శించారు.

ఇవాళ అమన్ గల్ లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్, రేపటి రోజున ఆడబిడ్డల పుస్తెల తాళ్లు కూడా తెంపుకుపోయే దరిద్రపు పాలన రాష్ట్రంలో ఉందన్నారు. తెలంగాణ ప్రజలను విజయవంతంగా మోసం చేస్తున్న రేవంత్ కు బుద్ది చెప్పే పని కల్వకుర్తి నుంచే మొదలుకావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

420 దొంగ హామీలు ఇచ్చి నంగనాచి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఎవరికి న్యాయం చేయలేదు. అక్కడ ఎవరికి రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలేదు. ఆడబిడ్డలకు 2500 రూపాయలు కూడా ఇవ్వలేదు. సొంత నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదు. పుట్టి పెరిగిన పిల్లనిచ్చిన కల్వకుర్తి ప్రాంతానికి కూడా ఒక్క రూపాయి పని చేయలేదు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాజు లాగా రైతు ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రహ్మాండంగా బతికిండు. పదేళ్లు మోటార్లు కాలలేదు. ట్రాన్స్ఫార్మర్లు పేలలేదు. పదేళ్లు రైతులు ఎవరి దగ్గర అప్పులు అడిగే పరిస్థితి లేకుండే. నాట్లేసే టైం కి టింగు టింగు మని రైతుబంధు పైసలు పడుతుండే.టకీ టకీ మని రైతు భరోసా ఇస్తనని రేవంత్ రెడ్డి గప్పాల్ కొట్టిండు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు.

కేసీఆర్ కంటే ఎక్కువగా రైతు భరోసా 15000 ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ 10 శాతం మంది రైతులకు కూడా ఇవ్వలేదు. సోనియా జన్మదినం సందర్భంగా రుణమాఫీ ఒకేసారి రెండు లక్షలు చేస్తానని చెప్పిండు. కానీ ఇప్పటివరకు చారన రుణమాఫీ కూడా చేయలేదు. 500 బోనస్ 10% మంది కూడా పడలేదు. ఆడబిడ్డలకు అరచేతిలో స్వర్గం చూపించిండు. పిల్లనిచ్చిన అత్తగారి ప్రాంతంలోనీ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రతినెలా 2500 రూపాయలు ఇస్తున్నాడేమో అనుకున్నా. అయితే అత్తగారి ప్రాంతాన్ని కూడా మోసం చేసిండు.

ఈ 14 -15 నెలలు 35 సార్లు ఢిల్లీకి చెక్కర్లు కొట్టడంతోనే రేవంత్ రెడ్డికి సరిపోయింది. కానీ ఢిల్లీ నుంచి 35 పైసలు కూడా తేలేదు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్స్ మైగ్రేషన్ తో వేరే రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వచ్చి పనిచేసేవారు. మొన్న తలుపులు ఎత్తుకుపోయిండు. నిన్న స్టార్టర్లు ఎత్తుకుపోయిండు. ఇక రేపు మీ పుస్తెలతాడు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకుపోతడు.

రేవంత్ రెడ్డి దొంగ అని ఎలక్షన్ల ముందు చెప్పినం. తెలంగాణ మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసాన్ని తెలుసుకుంది. రైతుకు కులం లేదు మతం లేదు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ పదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. 73000 కోట్ల రూపాయల రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ భారత దేశంలో కెసిఆర్ ఒక్కరే. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతు చనిపోతే అతని కుటుంబానికి 5 లక్షల భీమా ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.

మేనమామ లెక్క ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో లక్ష రూపాయలు ఇచ్చిండు. 200 రూపాయల పెన్షన్ ను పదిరెట్లు పెంచి 2000 రూపాయలు చేసిండు కేసీఆర్.

రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు. రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు కాబట్టే తెలంగాణ ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటున్నడు.

42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. రైతు భరోసా 15000 ఇస్తానని అన్నదాతలను మోసం చేసిండు.12000 ఇస్తానని రైతు కూలీలను మోసం చేసిండు. నెలకు 2500 ఇస్తానని ఆడబిడ్డలను మోసం చేసిండు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నాడు. లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అనీ వాళ్లను మోసం చేసిండు. ఇలా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి విజయవంతంగా మోసం చేస్తూనే ఉన్నాడు.

కాంగ్రెస్ 420 పాలనలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గురుకుల పాఠశాలలను నడపడం చేతకాని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇప్పటికి 56 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విషాదకరం. కాంగ్రెస్ దరిద్రపు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఎన్నికలకు ముందు కెసిఆర్ రైతుబంధు కోసం ఉంచిన పైసల్నే రేవంత్ రెడ్డి వేసిండు అంతేకానీ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒక్కో ఎకరానికి 17500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకొని తెలంగాణ ప్రజలు నిలదీయాలి.

ఎన్నికల తర్వాత దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించిండ్రు. ఆ భూముల రేట్లు పెంచుకోవడానికి ఇప్పుడు కొత్తగా పెద్ద రోడ్డు వేయాలని ప్లాన్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి ఫికర్ లేదు. 600 కోట్ల రూపాయలు ఇస్తే సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారం అవుతుంది. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే పని కల్వకుర్తి ప్రాంతం నుంచే మొదలుపెట్టాలి.

LEAVE A RESPONSE