Suryaa.co.in

Telangana

గోశాల కూల్చివేతపై డీజీపీ స్పందించాలి

– దాడులకు పాల్పడినవారికి యాదగిరి గుట్ట రూరల్ సీఐ,ఆలేరు ఎస్ ఐ వత్తాసు
– రామరాజ్యం వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి

భువనగిరి: ఆలేరు మండలం బహుదూర్ పేట గ్రామంలోని శ్రీ సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలను కూల్చివేసిన ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలని రామరాజ్యం వ్యవస్థాపకులు త్యాగరాజు బంటు వీర రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం భువనగిరి పట్టణంలోని రహదారి భవనం లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోశాల కూల్చివేత ఘటనపై యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండలరావు, ఆలేరు ఎస్సై రజినీకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు.

దోషులను శిక్షించవలసిన పోలీసులు బాధితులను ప్రివెంట్ అరెస్టులు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలకు ప్రజలే ప్రభువులని ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. పోలీసుల తీరు మార్చుకోకపోతే సీఆర్పీసీ సెక్షన్ 43, నూతన చట్టం బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 40 ని తామే ప్రయోగిస్తామని హెచ్చరించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే రామరాజ్యం ఏర్పడిందని, రామరాజ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక సేనాలను నియామకం చేస్తున్నామన్నారు.

గోశాల దాడికి పాల్పడిన గుండాలకు సపోర్టు చేస్తున్న పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోశాల ధ్వంసం విషయంలో “గోర “, అగోరాలు, నాగసాదవులు, హిందూసంఘాలు స్పందించాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. దాడి చేశారని ఫిర్యాదు చేసిన వారినే పోలీసులు నిర్బంధిస్తున్నారని. పిల్లే కదా అనీ బంధిస్తే అది పంజా విసురుతుందని గుర్తు చేశారు.

యాదగిరి గుట్ట రూరల్ సీఐ,ఆలేరు ఎస్ ఐ,దాడులకు పాల్పడినవారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఆవులకు నిలువ నీడ లేక ఎండకు ఎండుతూ, చలికి వణుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామరాజ్యం సేనలతో తిరిగి గోశాలను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోశాల ఏర్పాట్లు ఎవ్వరు ఆపలేరు అన్నారు.

ఈ సమావేశం లో రామరాజ్యం ఇందూరు బాధ్యులు సాయి నాధ్,నాయకులు జంపాల దశరథ, దయ్యాల సంపత్, పెరపు ఆనంద్,పాశికంటి సంపత్, కుండే గణేష్, లక్కాకుల రమేష్, పల్లె సత్యనారాయణ, కడగచ్ శ్రీనివాస్, రాయపురం భాస్కర్, లక్కాకుల శ్రీరామ్, చెక్క శేఖర్, ఉన్నారు\.

LEAVE A RESPONSE