Suryaa.co.in

Telangana

ధరణి మా జీవితాలను ఛిద్రం చేస్తుంది

– తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి
– బొమ్మరాస్‌పేట రైతు సంక్షేమ సంఘం

బొమ్మరాస్‌పేట రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధరణిలోని లోపాలను ఎత్తిచూపుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

శామీర్‌పేట మండల తహశీల్దార్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జాదారులు, కొందరు రాజకీయ నాయకులతో కూడిన భూ మాఫియా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణాన్ని అమలు చేస్తున్నారు.
ధరణి లోని లోపాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా దాదాపు 300 మంది చిన్న రైతులు సాగుచేసుకుంటున్న సుమారు 500 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

బొమ్మరాస్‌పేట్ గ్రామ రైతులు సుమారు 40 -50 సంవత్సరాల క్రితం భూములను కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి నుండి తాము వ్యవసాయం చేసుకుంటున్నామని తాము ధరణిలో ఇ-పాస్‌బుక్‌లతో రికార్డులో ఉన్నాము మరియు రైతు బంధు, రైతు భీమా మొదలైన అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతున్నాము.

కొన్ని చిన్న చిన్న వ్యాజ్యాలు ఉన్నప్పటికీ, అప్పటి రెవెన్యూ అధికారులు మరియు తరువాత 2020లో ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునల్ వారి వాదనలను తోసిపుచ్చి తమకు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది తరువాత తమను సివిల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశాలు జారీ చేసింది అని తెలిపారు.

ధరణి ప్రవేశపెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా న్యాయవాదులకు అనుకూలంగా మారింది, ఎందుకంటే ధరణిలోని సాఫ్ట్‌వేర్‌లోని లోపాల కారణంగా అనధికార/సంబంధం లేని వ్యక్తులు ఇతరులకు చెందిన భూముల కోసం మ్యుటేషన్‌లు, పాస్‌బుక్‌లు జారీ చేయడం మొదలైన వాటి కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి అనుమతించడంతో దీనిని సద్వినియోగం చేసుకొని తమ భూములను లాక్కోవడానికి దుగ్గిరాల కుటుంబానికి చెందిన వారసులు, భూ కబ్జాదారులు, రాజకీయ నాయకులు, అవినీతిపరులైన కొందరు రెవెన్యూ అధికారులతో కూడిన భూ మాఫియా ఏర్పడి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

శామీర్‌పేట మండల రెవెన్యూ అధికారి రైతులపై వేధింపులు,బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతున్నారు. మా భూముల్లో మాములుగా లావాదేవీలు జరపకుండా తప్పుడు పంపకాలు చేస్తూ భూకబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆర్డీఓ, కీసర మరియు జిల్లా కలెక్టర్‌కు పక్షపాత నివేదికలు ఇస్తూ ఇటీవల, కలెక్టర్ తన తప్పుడు నివేదికల ఆధారంగా పాస్‌బుక్‌ల జారీ మరియు స్లాట్ బుకింగ్‌ల కోసం కొన్ని దరఖాస్తులను ఆమోదించి స్కాం వెనుక ఉన్న ఏజెంట్‌తో మా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

అడిషనల్ కలెక్టర్‌తో మా సమావేశంలో మేము ఈ MRO మరియు ధరణి ఇన్‌ఛార్జ్ (డి సెక్షన్) యొక్క తప్పుడు చర్యలను బహిర్గతం చేసాము. దీంతో మా భూములపై తదుపరి విచారణను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి అత్యంత భయాందోళనలకు గురి అవుతున్నారని
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై మరింత ప్రత్యేకంగా ఎంఆర్‌ఓ, శామీర్‌పేట, జిల్లా కలెక్టర్, ధరణి తదితర ఇన్‌చార్జి అధికారులతో విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకొని ధరణి లోని లోపాలను వెంటనే సవరించి రైతు పక్షపాతిగా చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE