Suryaa.co.in

Andhra Pradesh

రూ.1237 కోట్ల నిధుల కేటాయింపుపై ధర్మారెడ్డి పెదవి విప్పాలి

• లడ్డూప్రసాదం పంచినట్టు.. భక్తుల సొమ్ముని టీటీడీ ఇష్టానుసారం ఎవరికి పడితే వారికి పంచేస్తుందా?
• టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తన కొడుకు ఎన్నికల ప్రచారానికి భక్తుల సొమ్ము (టీటీడీ సొమ్ము) దుర్వినియోగం చేస్తుంటే.. ధర్మారెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు?
• టీటీడీలో ఇంత జరుగుతుంటే దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ .. సంబంధిత శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏం చేస్తున్నారు?
• భూమన అభినయ్ రెడ్డి ఎన్నికల ఖర్చుకోసం వెచ్చించిన టీటీడీ నిధులు రూ.1237 కోట్లను ఎన్నికల ఖర్చులో చూపాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తాం.
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

తిరుమల తిరుపతి దేవస్థానం విభాగం లేని బడ్జెట్ ను ఉన్నట్టు చూపుతూ.. వందలకోట్ల కేటాయింపులతో కాంట్రాక్టుల బాగోతం నడుపుతోందని, టీటీడీలో అదనపు నిధులు లేకుండా, బడ్జెట్ ఆమోదం లేకుండా అడిషనల్ ఈవో ధర్మారెడ్డి దాదాపు రూ.1300కోట్లు ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“2023-24 ఆర్థిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బడ్జెట్ రూ.4,411కోట్లు. ఆ మొత్తంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు కేవలం రూ.300కోట్లు కేటాయించారు. ఏప్రియల్ లో ప్రారంభమైన బడ్జెట్లో … మాజీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి పదవీకాల ముగిసే నాటికి ఇంజనీరింగ్ పనుల కేటాయింపుల వ్యయం రూ.542 కోట్లకు చేరింది. తరువాత సెప్టెంబర్ లో భూమన కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ అవ్వగానే కేవలం మూడు నెలల్లోనే మరో రూ.1233 కోట్లు కేటాయించారు. ఈ విధంగా ప్రారంభంలో కేటాయించిన రూ.300 కోట్ల నిధులకు బదులు రూ.1777 కోట్ల మొత్తం పనులకు కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది.

సాధారణంగా టీటీడీ బడ్జెట్ ను ప్రభుత్వానికి పంపాకే.. అదనపు నిధుల కేటాయింపు జరగాలి. ఇలా చేయకుండానే కొత్త ఛైర్మన్ మూడునెలల్లోనే ఇంజనీరింగ్ వర్క్స్ కు అదనంగా రూ.1237కోట్లు కేటాయించారు. ఇదంతా తన కళ్లముందే జరుగుతున్నా, అడిషనల్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఏమీ సంబం ధం లేనట్టే వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నాం. టీటీడీ కస్టోడియన్ గా ఉన్న ధర్మారెడ్డి … ఇష్టానుసారం బడ్జెట్ ను మించి కేటాయింపులు చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి.

టీటీడీ అవకతవకలపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏం సమాధానం చెబుతారు?
టీటీడీ బడ్జెట్ లో 1 శాతం నిధుల్ని (అంటే రూ.44 కోట్లు) వివిధ పనులకోసం, మరో రూ.80 కోట్లను పారిశుధ్యం కోసం తిరుపతి మున్సిపాలిటీకి ఇస్తామని టీటీడీ ప్రతిపాదించగా.. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 1 శాతం నిధుల కేటాయింపును వ్యతిరేకంచింది. అయితే పారిశుధ్యం పేరుతో రూ.80కోట్లను ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో తిరుపతికి కేటాయిస్తు న్నట్టు అక్టోబర్లో టీటీడీ తీర్మానం చేసింది. ఇలా ఎందుకు చేశారో, ఏ పనులు ఆపేసి ఈ అదనపు కేటాయింపులు చేశారో ధర్మారెడ్డి సమాధానం చెప్పాలి. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం టీటీడీ సిబ్బంది..ఇతరత్రా ఉద్యోగుల జీతభత్యాలకు సంవత్సరానికి రూ.1533 కోట్లు, లడ్డూ ప్రసాదం..ఇతర పదార్థాల కొనుగోలుకు రూ.690 కోట్లు, కార్పస్ కి రూ.600 కోట్లు, ఇంజనీరింగ్ వర్క్స్ కు రూ.300 కోట్లు కలిపి మొత్తం 17 పద్దులకు నిధులు కేటాయించారు.

ఇలా ఇచ్చిన నిధుల్లో అదనపు కేటాయింపులకు టీటీడీ రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకుందా? రూ.1233కోట్లను ఇష్టానుసారం పనుల పేరుతో కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ప్రభుత్వ అనుమతి ఉందా? టీటీడీలో ఈస్థాయిలో అవకతవకలు కనిపిస్తుంటే దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ..సంబంధిత శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏం చేస్తున్నారు? రూ.400 కోట్ల నిధులతో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిధులతో ఇప్పటికే గరుడ వారధి నిర్మాణం పూర్తి చేసి రద్దీ తగ్గించినా, తిరుపతి మున్సిపాలిటీ పారిశుధ్యానికి నిధులు కేటాయించడం ఏమిటి? యాత్రికుల కోసమే అలా చేసినట్టు.. సిగ్గు లేకుండా మీ తప్పుల్ని సమర్థించుకుంటారా?

డెయిరీ ఫామ్ ప్రాంతం… ఎస్వీ ఆర్ట్ కాలేజ్… పద్మావతి గర్ల్స్ హైస్కూల్.. ఎస్వీ నగర్, గాంధీనగర్.. తిలక్ రోడ్.. బండ్లవీధి వంటి ప్రాంతాలకు యాత్రికులు వస్తారా.. యాత్రికులకు అక్కడేం పని? అక్కడ జరిగే శానిటేషన్ పనులకు టీటీడీ నుంచి నిధులు కేటాయించడం ఏమిటి? తిరుపతి మున్సిపాలిటీ చేయాల్సిన పనుల్ని టీటీడీ చేయించడం ఏమిటి? అసలు తిరుపతి మున్సిపాలిటికీ ఏపీ ప్రభుత్వం నుంచి.. కేంద్రప్రభుత్వం (స్వచ్ఛ భారత్ స్కీమ్ ద్వారా) నుంచి వస్తున్న నిధులెన్ని? ఆ నిధులు చాలక టీటీడీ సొమ్ముని శానిటేషన్ పనులకు వినియోగించారా?

టీటీడీ బడ్జెట్ కేటాయింపులు..తిరుపతి మున్సిపాలిటీకి కేటాయించిన నిధుల వివరాలు సహా..పూర్తి సమాచారం ఎందుకు టీటీడీ వెబ్ సైట్లో ఉంచడంలేదో ధర్మా రెడ్డి చెప్పాలి
ఇంత జరుగుతుంటే తిరుపతి ఎమ్మెల్యే కూడా అయిన భూమన ఎందుకు మౌనంగా ఉన్నారు? కరుణాకర్ రెడ్డి వచ్చాకే ఈ విధంగా అడ్డగోలు కేటాయింపులు ఎలా చేస్తున్నారు? తిరుపతిలో అంతకు ముందులేని శానిటైజేషన్ సమస్య…. కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాకే వచ్చిందా? ఏపీ ప్రభుత్వం తిరుపతి మున్సిపాలిటీకి ఎలాంటి కేటాయింపులు చేయడంలేదా? మున్సిపాలిటికీ ప్రజలనుంచి వస్తున్న ఆదాయం అంతా ఏమవు తోంది? రూ.75 కోట్లు వెచ్చించి పద్మావతి నిలయం కడితే… దానినుంచి టీటీడీకి సరైన అద్దె కూడా రావడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే మరలా కొత్తగా సిమ్స్ భవనాలు కూల్చేస్తామంటున్నారు.

టీటీడీ ఛైర్మన్ మారినప్పుడల్లా ఇష్టానుసారం బడ్జెట్ కేటాయింపులు… నిధుల ఖర్చు చేసేస్తారా? తిరుపతి స్వామి వారి లడ్డూప్రసాదం పంచి నట్టు.. భక్తుల సొమ్ముని ఇష్టానుసారం ఎవరికి పడితే వారికి పంచేస్తారా? బడ్జెట్ కేటాయింపులు..తిరుపతి మున్సిపాలిటీకి చేసిన కేటాయింపుల వివరాల్ని టీటీడీ ఎందుకు భక్తుల ముందు ఉంచడంలేదు? టీటీడీ వెబ్ సైట్లో ఎందుకు పూర్తి సమాచారం ఉంచడంలేదో ధర్మా రెడ్డి చెప్పాలి. టీటీడీ వెబ్ సైట్లో 2021-22 ఇంజనీరింగ్ వర్క్స్ కు సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయి. గత రెండేళ్లుగా చేసిన ఖర్చులు.. కేటాయింపుల వివరాలు ఎందుకు లేవో ధర్మారెడ్డి చెప్పాలి.

టీటీడీ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ 5 ఏళ్లల్లో ఇంజనీరింగ్ వర్క్స్ కు కేటాయించిన మొత్తంసొమ్ము… జరిగిన పనుల వివరాలు తెలియచేస్తూ తక్షణమే ధర్మారెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ ను ధర్మారెడ్డి వైసీపీ ఎన్నికల బడ్జెట్ లా మార్చారు. టీటీడీ ఛైర్మన్ తన కొడుకు ఎన్నికల ప్రచారానికి భక్తుల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే.. ధర్మారెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? భూమన అభినయ్ రెడ్డి ఎన్నికల ఖర్చుకోసం వెచ్చించిన టీటీడీ నిధులు రూ.1237 కోట్లను కూడా ఎన్నికల ఖర్చులో చూపాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తాం. ధర్మారెడ్డి టీటీడీ అడిషనల్ ఈవోగా కంటే.. భూమన ఫ్యామిలీ క్యాంపెయి న్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. భక్తులు తినే అన్నప్రసాదంలో నాణ్యత లోపించి నా స్పందించని స్థితిలో అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఉండటం నిజంగా బాధాకరం.

పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వైసీపీ కార్యకలాపాలకు కేంద్రంగా ధర్మారెడ్డి మార్చారు. టీటీడీ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ 5 ఏళ్లల్లో ఇంజనీరింగ్ వర్క్స్ కు కేటాయించిన మొత్తంసొమ్ము… జరిగిన పనుల వివరాలు తెలియ చేస్తూ తక్షణమే ధర్మారెడ్డి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ వర్క్స్ ఎప్పుడు జరిగాయి….వాటికి ఎంత నిధులు ఎప్పుడు కేటాయించారో తెలియ చేస్తూ ధర్మారెడ్డి వారంలో వాస్తవాలతో పూర్తి సమాచారం ప్రజల ముందు ఉంచాలి.

మా డిమాండ్ పై ధర్మారెడ్డి స్పందించకుంటే.. టీడీపీ ప్రభుత్వం రాగానే సీఐడీ విచారణ జరిపించి.. టీటీడీ నిధుల గోల్ మాల్ లోని గుట్టుమట్లు బయటపెట్టి, తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం ” అని విజయ్ కుమార్ తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE