బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేత్కర్ వర్ధంతి వేడుకలు

-అంబేద్కర్ ఆశయాలను బిజెపి నెరవేరుస్తోంది
-మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు

అంబేద్కర్ గొప్ప జాతీయవాది అంతకు మించిన సామాజిక తత్తవేత్తగా బిజెపి నేతలు గుర్తు చేసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సమాజంలో ఉన్నఅంటరానితనం రూపుమాపడానికి ఆయన ఒక మార్గదర్శి కూడా ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాల్సిన అవసురం ఉంది. భారత ప్రధాని నరేంద్రమోదీ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న నేతగా బిజెపి నేతలు ప్రస్తుతించారు. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన తరువాత కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం ప్రారంభిస్తూ సమాజంలో అంటరానితనం రూపుమాపడంలో అంబద్కర్ క్రుషి మరువరానిదన్నారు.

మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్నందువల్లనే భారత ప్రజలు నరేంద్రమోదీ ని రెండు పర్యాయాలు గెలిపించారు . మూడవ పర్యాయం కూడా గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు అన్నారు.

అంబేద్కర్ ను గుర్తు చేసుకునేందుకే డిజిటల్ ఫ్లాట్ ఫాం పై భారత ప్రధాని భీమ్ యాప్ ను ఆవిష్కరించిన సంగతి బిజెపి నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ సమావేశంలో బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బిజెపి నేతలు మువ్వల వెంకట సుబ్బయ్య, రాజాబాబు, మాదల రమేష్,శేషుకుమార్, కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply