Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం, సహకారంపై జీవీఎల్ చర్చ

– బీజేపీ ఎంపీ జీవీఎల్ సెయిల్ సీఎండీతో సమావేశం
– ఆర్‌ఐఎన్‌ఎల్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎంపీ జీవీఎల్ హామీ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌గా ప్రసిద్ధి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) సహాయం కోసం తన నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తూన్న, బిజెపి రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహారావు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అమరేందు ప్రకాష్‌తో సమావేశమయ్యారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్‌తో విలీనం చేసే అవకాశం పై ఇంకా ఆర్‌ఐఎన్‌ఎల్ యొక్క ఆర్థిక పనితీరును మెరుగుపరచేందుకు ఉత్పత్తిని పెంచడానికి మూడవ బ్లాస్ట్ ఫర్నేస్‌ను ఆపరేట్ చేయడానికి సెయిల్ నుండి సహాయం కోరారు.

రెండు వారాల క్రితం, RINL ఎగ్జిక్యూటివ్ మరియు ఉద్యోగుల సంఘాలు BJP MP GVLను కలుసుకుని, RINLని సెయిల్‌తో విలీనం చేయాలని లేదా RINL యొక్క మూడవ బ్లాస్ట్ ఫర్నేస్‌ను ఆపరేట్ చేయడానికి SAIL నుండి సహాయం అందే విధంగా ఆయన ప్రయత్నించాలని అభ్యర్థించడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సెయిల్ సీఎండీతో ఎంపీ జీవీఎల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ సమస్యలను కేంద్ర ఉక్కు, బొగ్గు, ఆర్థిక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NDMC), కోల్ ఇండియా మొదలైన PSUల ద్వారా ముడిసరుకు సరఫరా, వర్కింగ్ క్యాపిటల్‌ అందజేయడం వంటి విషయాలపై చర్యల ద్వారా గత రెండేళ్లుగా స్టీల్ ప్లాంట్ కు సహకరిస్తున్నట్లు తెలియజేశారు.

SAILతో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం రెండు సంస్థలకి గొప్ప విజయం వంటిదని జీవీఎల్ వ్యాఖ్యానించారు.19,650 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కలిగి, రెండు పోర్టులు కలిగి ఉండటం RINL యొక్క గొప్ప సౌలభ్యం అని జీవీఎల్ సెయిల్ సిఎండికి తెలియజేశారు.

ప్రస్తుతం, SAIL ల్యాండింగ్ పోర్ట్‌ల నుండి చాలా దూరంలో ఉన్న తన ప్లాంట్‌లకు ముడి పదార్థాలను రవాణా చేస్తుందనీ మరియు దక్షిణ మరియు పశ్చిమ రాష్ట్రాలలోని మార్కెట్‌లకు సుదూర ప్లాంట్ల నుండి తుది ఉత్పత్తులను రవాణా చేస్తుందనీ, SAILతో RINLని విలీనం చేయడం ద్వారా ఈ అదనపు లాజిస్టిక్స్ ధరను నివారించవచ్చనీ జీవీఎల్ తెలియజేస్తూ ఈ విలీనం RINLకి బాగా సహాయం చేస్తుందనీ, మరియు SAIL యొక్క క్యాప్టివ్ ఇనుప ఖనిజం మరియు బొగ్గు గనుల నుండి ముడి పదార్థాలను పొందడం ద్వారా దాని ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుందనీ అన్నారు.

SAILతో RINL యొక్క సంభావ్య విలీన అంశ విషయంలో SAIL చీఫ్ యొక్క అభిప్రాయాలను ఈ సమావేశంలో జీవీఎల్ అడిగి తెలుసుకున్నారు. సెయిల్ సీఎండీని కలిసిన అనంతరం ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఓ ప్రకటనలో మాట్లాడుతూ, ‘‘ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు చేసినా తాను తప్ప వైసీపీ, టీడీపీ ఎంపీలు ఎవరూ పట్టించుకోలేదనీ, పార్లమెంటు లోపలగానీ, బయటగానీ అన్ని అంశాలను తానే ప్రశ్నిస్తున్నానని, విశాఖ ఉక్కు ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతరం తాను కృషి చేస్తాననీ కార్మికులకు మరియు ఎగ్జిక్యూటివ్లకు హామీను ఇచ్చారు.

LEAVE A RESPONSE