సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు. సీఎంగా ఆయన రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఆయన కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఈ సందర్భంగా వారిని కోరారు. కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ ను సోనియా, రాహుల్ అభినందించారు.

అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో కూడా రేవంత్ సమావేశమయ్యారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు.

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గ్యారెంటీలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకు వస్తుందన్నారు.

Leave a Reply