Suryaa.co.in

Telangana

మాస్టారు అవతారమెత్తిన మంత్రి జగదీష్‌రెడ్డి

-జీవిత పాఠాలు చెప్పిన జగదీష్‌రెడ్డి
-ఉపాధి అంటే ఉద్యోగమే కాదు
-విద్యార్థి యువతకు పాజిటివ్ దృక్పథం అలవడాలి
-తద్వారా ఉన్నత శిఖరాలనందుకోవొచ్చు
-ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి
-ఉద్యోగ ప్రయత్నమే జీవితం కాకూడదు
-ఆడి ఓడాలి… ఓడితే కుంగొద్దు
-ఓటమి విజయానికి తొలిమెట్టు
-మీ నడవడికనే మీ కుటుంబానికి పేరు,ప్రతిష్టలు
-తల్లి,తండ్రుల ఆశయ సాధనలో ముందుండాలి
-సూర్యాపేటలో గ్రూప్ 2,3,4 లలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
-ముఖ్య అతిదిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
-ఉన్నత శిఖరాలను అధిరోహించడంపై నిరుద్యోగులకు ఉపోద్ఘాతం
-స్వీయ అనుభవాలతో పాటు వివిధ రంగాలలో విజయాలు సాధించిన వారి రహస్యాలను వివరించిన మంత్రి జగదీష్ రెడ్డి
-మంత్రి మాటలతో మంత్ర ముగ్దులైన నిరుద్యోగ యువత

తెలంగాణ సీనియర్‌ మంత్రి జగదీష్‌రెడ్డి మాస్టారి అవతారమెత్తారు. పిల్లలకు జీవిత పాఠాలు నేర్పారు. జీవితంలో ఎలా వృద్ధిలోకి రావాలో మెళకువలు బోధించారు. చదువు విజ్ఞానం కోసమే తప్ప, ఉద్యోగం కోసమే కాదన్నారు. జీవితంలో ఉద్యోగమే ప్రధానం కాదన్నారు. విద్యార్థి యువత పాజిటివ్ దృక్పధాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా ఉన్నతశిఖరాలను అధిరోహించడం సులభ తరమౌతుందని ఆయన యువత కు ఉద్బోధించారు.యస్ సి స్టడీ సర్కిల్ లో గ్రూప్ 2,3,4 లలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువత కు ఆయన ఈ రోజు స్టడీ మెటీరియల్ అంద జేశారు. విద్యార్థి యువతలో ఆత్మస్థైర్యం ఇనుమడింప చేసే విదంగా తనదైన శైలిలో ఆయన ప్రత్యేక క్లాస్ తీసుకున్నారు.

వ్యక్తిత్వ వికాసం బోధించే నిపుణుడినిమై మరిపించే రీతిలో సాగిన మంత్రి జగదీష్ రెడ్డి ఉపోద్ఘాతం నిరుద్యోగ యువత ను మంత్రముగ్దులను చేసింది.వారిని కట్టి పడేసేలా గంటన్నర సేపు సాగిన ప్రసంగం ఆసాంతం స్వీయ అనుభవాలు,వివిధ రంగాలలో నిష్ణాతులైన వారి చరిత్రను సోదాహరణంగా వివరిస్తుంటే విద్యార్థి యువత అమితాశక్తి తో తిలకించారు.ఉపాధి అంటే ఉద్యోగమే కాదని,ఉద్యోగ ప్రయత్నాలు మంచిదే అని రాకుంటే నిరాశ పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఉద్యోగావకాశాలకై ప్రయత్నం చేస్తూనే ప్రత్యమ్నాయా ఉపాధి అవకాశాలను చూసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగ ప్రయత్నమే జీవితం అనుకోవడం పొరబాటు అవతుందని ప్రపంచీకరణ లో ప్రత్యమ్నాయా ఉపాధి అవకాశాలు మెండుగా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆడి ఓడాలని అంటే ప్రయత్నం చేసి సక్సెస్ అయితే మంచిదని విఫలం అయితే కుంగొద్దు అని ఆయన చెప్పారు. మీ నడవడికనే మీ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు తెచ్చిపెడతాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదన్నారు.తల్లి తండ్రులు కన్న కలల సాకరానికై విద్యార్థి యువత ఎప్పుడూ సాధన చేస్తునే ఉండాలని విద్యార్థి యువతకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ కుమార్, ఎమ్మార్.పి. ఎస్ రాష్ట్ర నాయకులు చిన శ్రీరాములు, దయానంద రాని తదితరులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE