Suryaa.co.in

Features

ధర్మం అంటే ఏమిటి?

అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం: వివాహ ధర్మం!
తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం: భార్య ధర్మం!
నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం : మిత్ర ధర్మం!
సోమరితనం లేకుండ టం: పురుష ధర్మం!
విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం: గురుధర్మం!
భయభక్తులతో విద్యను నేర్చుకోవటం: శిష్య ధర్మం!
న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం: యజమాని ధర్మం!
భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపటం: ఇల్లాలి ధర్మం!
సైనికుడుగా వుండి దేశాన్ని,ప్రజలను కాపాడటం: సైనిక ధర్మం!
వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం: బిడ్డల ధర్మం!
తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం : తండ్రి ధర్మం!
తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం: బిడ్డలందరి ధర్మం!
తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం : వృత్తి ధర్మం!
తీసుకున్న జీతానికి నమ్మకంగా పని చేయడం: ఉద్యోగి ధర్మం
తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం : సంసార ధర్మం!
అసహాయులను కాపాడటం: మానవతా ధర్మం!
చెప్పిన మాటను నిలుపుకోవటం : సత్య ధర్మం

LEAVE A RESPONSE