– బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు
– రాజంపేటలో కెసిఆర్ , కవిత దిష్టి బొమ్మ దహనం
రాజంపేట: ధర్మపురి అరవింద్ ఇంటి మీద దాడి ఖండిస్తూ కెసిఆర్ , కవిత దిష్టి బొమ్మ దహనం. కేవలం కల్వకుంట్ల అరాచకాలు ప్రశ్నించినందుకు ధర్మపురి ఇంటిమీద దాడి చేశారు. ఇంట్లో తల్లిని కూడా బెదిరించడం బాధాకరం. అధికారం ఉంది కదా అని దాడులకు దిగితే , దేశంలో ఎక్కడా తిరగలేరు. బీజేపీ కార్యకర్త మీద దాడి చేస్తే దేశంలో అన్నిప్రాంతాలలో ఉద్యమిస్తాం.
కార్యకర్తలకు అండగా ఉంటాం. మరో పశ్చిమ బెంగాల్, లాగా తెలంగాణ లో ప్రతిపక్షాలను , ప్రశ్నించే నాయకులను అణగత్రొక్కే చర్యలు కొనసాగిస్తున్నారు.