Suryaa.co.in

Andhra Pradesh

సీఎం జగన్ రాయలసీమ ద్రోహి

– పోలీసులు యూనిఫాం తీసేయండి
– పేటీఎం బ్యాచ్‍కు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి రెచ్చగొట్టి పంపారు
– అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా
– నేను ఒంటరి వాడిని కాదు.. ఐదు కోట్ల మంది అండగా ఉన్నారు
– ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి
– వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి
– కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన స్థానిక నేతలు
– వారిని ఆహ్వానించి ప్రసంగించిన చంద్రబాబు

ధర్మాన్ని కాపాడేందుకు ప్రజలంతా ముందుకురావాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాయలసీమ ద్రోహి జగన్‌ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారని, అలాంటివారు యూనిఫారం తీసి వైసీపీలో చేరాలన్నారు. తాను ఒంటరివాడిని కాదని, కోట్లాదిమంది అండ తనకుందని చెప్పారు. కర్నూలులో నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు ఏమన్నారంటే.. వెనుకబడినవర్గాలకు వెన్నెముక తెలుగుదేశం పార్టీ.వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.వెనుకబడినవార్గాలకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ.ప్రారంభం నుండి పేదల పార్టీ తెలుగుదేశం.

మొట్టమొదట భారత దేశ చరిత్రలో25 కేంద్రాలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. ఆ తరువాత ఇది చాలదని గ్రహించి 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది.33 శాతం నుండి 25 శాతానికి తగ్గించిన నీచ చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది.

వెనుకబడిన వర్గాలకు సమాజంలో గుర్తింపు ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం.వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనేదే తెలుగుదేశం లక్ష్యం.వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆదరణ పథకాన్ని పెట్టాను. బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాను. రాజకీయ ప్రాముఖ్యతను ఇచ్చాం. రెండు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు బీసీలే ఉన్నారు. అది టీడీపీ ఘనత.ఏపీలో అచ్చెన్నాయుడుఉంటే, తెలంగాణలో జ్ఞానేశ్వర్ ఉన్నారు.

వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. వైసీపీ నాయకులంతా దొంగలు, దోపిడీదారులు, రౌడీలు, కరడుగట్టిన నేరస్థులు, భూకబ్జాదారులు. ఇది పేదవారి రాష్ట్రంరాష్ట్రంలో వైసీపీ అరాచకాలు అధికమయ్యాయి.వైసీపీలోని ఛోటా మోటా నాయకులందరూ కూడా దొంగల్లా తయారయ్యారు.రాష్ట్రాన్ని నాశనం చేశారు.అందరూ ఒకేమాట మీద ఉండాలి. ఊర్దూ యూనివర్శిటీ తెచ్చాను. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తాను 50 కార్పొరేషన్ లైతే పెట్టారుగానీ ఆ కార్పొరేషన్ ఆఫీసులలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు.

విశాఖను రాజధాని చేస్తామంటున్నారు. అది విశాఖ ప్రజలపై ఉన్న ప్రేమ కాదు, అక్కడి భూములపై ఉన్న ప్రేమ.వైసీపీ నాయకులు అనేక చోట్ల భూములు కబ్జా చేశారు. ప్రజలందరూ గమనిస్తున్నారు.ఎవరినీ వదిలిపెట్టము, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దోచుకో దాచుకో కార్యక్రమం మొదలుపెట్టారు.మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.అందరూ రేపటి నుంచి టీడీపీ అభివృద్దికి పని చేయాలి.వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి.

జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభ సభ

సభకు అంతరాయం కలిగించిన వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపాటు
సీఎం జగన్ రాయలసీమ ద్రోహి. పోలీసులు యూనిఫాం తీసేయండి. ఎస్పీ ఎవరిని కాపాడుతున్నారు?కర్నూలులో బెంచ్ పెట్టాలని నేనే చెప్పాను. మీ వల్ల కాకపోతే చెప్పండి.. నేనే చూసుకుంటా. ఓడిపోతారని తెలిసి జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పేటీఎం బ్యాచ్‍కు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి రెచ్చగొట్టి పంపారు. అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా. రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ టీడీపీ. రాజకీయ రౌడీలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అణచివేయడం కష్టం కాదు.ఆడబిడ్డల పట్ల ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం.ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి. మీరు చూపిన చొరవను అభినందిస్తున్నా. నేను ఒంటరి వాడిని కాదు.. ఐదు కోట్ల మంది అండగా ఉన్నారు. వైసీపీ మాదిరి చిల్లర రాజకీయాలు చేయను.

LEAVE A RESPONSE