Suryaa.co.in

Andhra Pradesh

ఇరిగేషన్‌ మంత్రిగా ఒక్క పనైనా చేశారా?

-ఈయన ఆంబోతు రాంబాబు…
-లిక్కర్‌ డాన్‌ అట…33 శాతం వాటా ఇవ్వాలట…
– ఇలాంటి వారు మనకు అవసరమా?
– సత్తెనపల్లి బహిరంగ సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఫైర్‌

సత్తెనపల్లిలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి గురువారం బహిరంగ సభలో ప్రసంగించారు. అంబటి రాంబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారట. సాగర్‌ కాలువల ఆధునీకరణ చేస్తామన్నారు. రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు వరకు ఇస్తామని చెప్పారు. ఆధునీకరణ పక్కన పెడితే క్రాప్‌ హాలీడేలు ఇచ్చారట. పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇదేనా రైతుల మీద జగన్‌కున్న ప్రేమ.

సత్తెనపల్లిలో అంబటి రాంబాబును గెలిపిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఈయన ఆంబోతు రాంబాబు. ఇరిగేషన్‌ మంత్రిగా కనీసం కాలువల ఆధునీకరణ చేయలేదని మండి పడ్డారు. నియోజకవర్గం కోసం ఒక్కరోజైనా పని చేశారా అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టుల కు గేట్లు కొట్టుకుపోతుంటే కనీసం చర్యలు లేవు. నియోజకవర్గం మొత్తం మట్టి మాఫియా, ఇసుక మాఫియా. ఈయన లిక్కర్‌ డాన్‌..లిక్కర్‌ అమ్మకాల్లో 33 శాతం వాటా ఇవ్వాలట. ఇలాంటి వారు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ప్రతి పేద మహిళ కుటుంబానికి రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు, ప్రతి ఏటా లక్ష సాయం, 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE