Home » ముగిసిన నామినేషన్ల ఘట్టం

ముగిసిన నామినేషన్ల ఘట్టం

-25 ఎంపీ స్థానాలకు 555 మంది
-175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌ ఘట్టం గురువారంతో ముగిసింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు 555 మంది అభ్యర్థులు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది అభ్యర్థులు 4,265 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జగన్‌ పోటీచేసే పులివెందుల నుంచి 37, చంద్రబాబు పోటీ చేసే కుప్పం నుంచి 32, పవన్‌ పోటీ చేసే పిఠాపురం నుంచి 19, లోకేష్‌ పోటీ చేసే మంగళగిరి నుంచి 65, బాలకృష్ణ పోటీ చేసే హిందూపురం నుంచి 19, బీజేపీ చీఫ్‌ పురేందేశ్వరి పోటీ చేసే రాజమండ్రి పార్లమెంట్‌ నుంచి 22, కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల పోటీ చేసే కడప పార్లమెంటుకు 42 నామినేషన్లు దాఖలయ్యాయి.

Leave a Reply