Suryaa.co.in

Andhra Pradesh

బాబుకు, జగన్‌ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే

-మోదీ పొత్తు ఒకరు..తొత్తు ఒకరు…
-ఆయనను నిలదీసే దమ్ముందా?
– బాబు, జగన్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే
– బీజేపీకి బానిసలు మనకొద్దు…
– ఒకరు సింగపూర్‌..మరొకరు వాషింగ్టన్‌ అన్నారు…
– అమరావతిని భ్రమరావతి చేసి చేతిలో చిప్ప పెట్టారు…
– కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
– పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. రాష్ట్రానికి రాజధాని లేదు. మన రాష్ట్రానికే ఈ దుస్థి తి. మనకు చేతిలో చిప్ప తప్ప ఏమీ లేదు. చంద్రబాబు సింగపూర్‌ అన్నాడు. 3డీ గ్రాఫిక్స్‌ చూపించారు. 30 వేల ఎకరాలు తీసుకున్నారు. 2015లో మోదీ వచ్చి భూమి పూజ చేశా డు. యమునా నది నుంచి మట్టి తెచ్చాడు. మనకు మిగిలింది చివరికి మట్టి..ఢల్లీి తలదన్నే రాజధాని ఉండాలని మోదీ చెప్పాడు. బాబు సింగపూర్‌ లాంటి రాజధాని అన్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధాని అన్నాడు. అమరావతి కాస్త చివరికి భ్రమరావతి చేశాడు. హైదరాబాద్‌ నేనే కట్టా అన్నాడు. హైదరాబాద్‌ మించిన రాజధాని అని మళ్లీ చెప్పాడు. బాబు హయాం లో తాత్కాలిక భవనాలు తప్ప మిగిలింది ఏమీ లేదు.. దేశ విదేశాలు తిరిగాడు తప్ప… పెట్టుబడులు రాలేదు.ఉద్యోగాలు లేవు..పరిశ్రమలు లేవు.

వాషింగ్టన్‌ చేశాడా?
ఇక జగన్‌మోహన్‌ రెడ్డి గెలిస్తే వాషింగ్టన్‌ డీసీ అన్నాడు. తర్వాత ఒక్కటి కాదు మూడు అన్నాడు. మూడు కాదు కదా ఒక్క రాజధానికి దిక్కులేదు. పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రాజధానికి సహాయం చేస్తామని బీజేపీ మోసం చేస్తే… మళ్లీ వాళ్ల కొంగు పట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకు నిధులు ఇవ్వలేదు అని అడిగిన వాళ్లు లేరు. మోదీ కోసం చేస్తే నిలదీసే దమ్ము లేదు. ఈసారి బాబుకు ఓటు వేసినా, జగన్‌కు వేసినా డ్రైనేజీలో వేసినట్లేనని విమర్శించారు. మనకు రాజధాని కావాలి అంటే…కాంగ్రెస్‌ రావాలి. పోలవరం కట్టాలి అంటే రాజధాని రావాలి. మనకు ఈ పొత్తులు, తొత్తులు వద్దు…కాంగ్రెస్‌ అధికారంలో వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పిలుపుని చ్చారు.

LEAVE A RESPONSE