తెలుగు సినిమాకు
ఓ విలక్షణ ముద్ర వేసిన మహానుభావుడు!
సినిమా తెరపై సామాజిక చైతన్యాన్ని
అక్షరాలా నర్తింపజేసిన యోధుడు!
అటు కథలో,
ఇటు మాటల్లో
ప్రజల గుండె చప్పుడు
వినగలిగిన రచయిత,
దర్శకుడు.. నటుడు కూడా!
అలాంటి నా అభిమాన..
స్వర్గీయ
టి. కృష్ణ
గారిని స్మరించుకుంటే..
కళ్లలో కన్నీళ్లు
గుండెల్లో గర్వం
పుడుతుంది!
“నేటిభారతం”
“రేపటి పౌరులు”
“ప్రతిఘటన”
“దేవాలయం”
“దేశంలో దొంగలు పడ్డారు”
వంటి చిత్రాలు
కేవలం సినిమాలు కావు..
అవి ప్రజల గళం
యువతకు దిశా నిర్దేశం!
ఒక్కో మాట ఉద్యమమయింది
ఒక్కో షాట్ కళ్లను తెరిపించింది!
తన రచనల్లో డాబు లేదు!
ఒక మారుమూల గ్రామానికీ
ఒక సాధారణ యువకుడికీ
చలనచిత్రంతో చిత్రంగా
పోరాట బాట చూపిన వ్యక్తి!
తన గొప్పతనాన్ని మాటల్లో
చెప్పకుండా పాత్రల చేత
పలికించిన విలక్షణ చిత్రశిల్పి!
ఆయన మనమధ్య లేరంటే
మన సినిమాకు మాత్రమే కాదు..
మన సమాజానికీ లోటే!
సినిమాను ఆయుధంగా
మార్చిన విప్లవదధీచి!
పల్లె ప్రజల కన్నీళ్లకు పలుకులు
మప్పిన కలం ధనుడు!
ఆయన ఆత్మకు శాంతి
చేకూరాలని ప్రార్థిస్తూ
అభిమానం నిండిన
గుండెతో శత శత వందనాలు!
గురూజీ..
మీరు మరణించలేదు…!
మీ ఆలోచనలు,
మీ మాటలు,
మీ సినిమా
ఇవన్నీ నిలిచే ఉన్నాయి!
– రామకృష్ణ
(స్వర్గీయ టి కృష్ణ అభిమాని)