Suryaa.co.in

Andhra Pradesh

అన్నమయ్య డ్యాం స్పిల్‌వే విరగడం వల్లే విపత్తు

ఇటీవల వరదల సమయంలో అన్నమయ్య డ్యాంకు ఒకేసారి.. స్పిల్‌వే సామర్ధ్యానికి మించి వరద రావడం వల్లనే అది విరిగిపోయి విపత్తు సంభవించిందని.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చెప్పారు.
రాజ్యసభలో డ్యాం సేఫ్టీ బిల్లు చర్చకు సమాధానం సందర్భంగా అన్నమయ్య డ్యాం గురించి.. ప్రస్తావించారు. ఇటీవల వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య డ్యాంకు ఒకేసారి స్పిల్‌వే సామర్థ్యానికి మించిన వరద రావడంతో అది విరిగిపోయి విపత్తు సంభవించిందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు.
రాజ్యసభలో డ్యాంసేఫ్టీ బిల్లు చర్చకు సమాధానమిస్తూ చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందే సమయానికి దేశంలో 41 డ్యాంలు తెగిపోయాయని, రాజ్యసభలో ఆమోదించేసరికి ఆ సంఖ్య 42కి చేరిందని గుర్తు చేశారు.
‘అన్నమయ్య డ్యాంకు ఒకేసారి దాని స్పిల్‌వే సామర్థ్యానికి ఒకటిన్నర రెట్లు అధికంగా నీళ్లు వచ్చాయి. అందుకే స్పిల్‌వే విరిగిపోయింది. స్పిల్‌వే, గేట్లు తెరిచి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. కానీ ఒక గేటు తెరుచుకోలేదు. దానికి బాధ్యులు ఎవరు? రాష్ట్రానికి దాని బాధ్యత లేదా? ఈ డ్యాం గురించి అంతర్జాతీయంగా అధ్యయనం మొదలుపెడితే అది మనకు సిగ్గుచేటు. డ్యాం తెగిపోవడానికి సభలో కూర్చున్న సభ్యులంతా బాధ్యత వహించాల్సిందే. డ్యాం సేఫ్టీ బిల్లు ద్వారా ఏర్పాటు చేస్తున్న జాతీయ డ్యాం సురక్ష ప్రాధికార సంస్థకు జరిమానాలు వేసే అధికారం ఉంటుంది. డ్యాం రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (డ్రిప్‌)లో ఆంధ్రప్రదేశ్‌ డ్యాంలను డ్రిప్‌లో చేర్చలేదని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే కొలమానాలను ఆంధ్రప్రదేశ్‌ చేరుకోలేదు. చేరుకుంటే మీరు సూచించిన డ్యాంలనూ ఇందులో చేరుస్తామని సభాముఖంగా చెబుతున్నా’ అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రుణం పొందిన ప్రాజెక్టులివీ
ఆంధ్రప్రదేశ్‌లో చింతలపూడి ఎత్తిపోతలు, కొండవీటి ఎత్తిపోతలు, పురుషోత్తంపట్నం ఎత్తిపోతలు, వైఎస్‌ఆర్‌ పలనాడు కరవు నివారణ పథకాలకు ఆర్‌ఈసీ రుణం అందించినట్టు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.
‘పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రాయలసీమ కరవు నివారణ పథకం కోసం చేపట్టిన పథకానికి 10.65% వార్షిక వడ్డీతో రుణం అందిస్తున్నాం. రుణ కాలపరిమితి 12 ఏళ్లు ఉంటుంది. దీని చెల్లింపు 2026 అక్టోబరు 15 నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో పూచీకత్తు ఇచ్చింది’ అని వెల్లడించారు.

LEAVE A RESPONSE