– తొమ్మిదేళ్లలో రూ. 30 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైల్వే కోసం ఖర్చు
– బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రైల్వే లైన్లకు ఎక్కువ ప్రాధాన్యత
– 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ
– కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ శంకుస్థాపన సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కొమురవెల్లి మల్లన్న దర్శానానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ స్టేషన్ నిర్మాణానికి సహకరించిన రైల్వేశాఖా మంత్రి అశ్విణి వైష్ణవ్‌కి ధన్యవాదాలు. కొమురవెల్లి కొండ ప్రాంతం కాబట్టి చుట్టు ప్రక్కల ఏటవాలుగా ఉండటం వలన స్టేషన్ నిర్మాణానికి అనుకూలంగా లేదని గతంలో నివేదిక ఇచ్చారు. ప్రధానమంత్రిని చాలాసార్లు కలిసి కొమురవెల్లి మల్లన్న స్వామి విశిష్టత వివరించాను.
వెంటనే మోదీ రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ని రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం నరేంద్ర మోదీ కృషితో ఈరోజు రైల్వేస్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నాం. గతంలో ఈ రైల్వే లైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
గత యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వేల విషయంలో చాలా వివక్ష చూపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ది కోసం అనేక లైన్ల నిర్మాణాలు చేపట్టారు. సుమారు 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నాం. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్, రూ.450 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్, కొత్తగా చర్లపల్లి రైల్వే టర్మినల్ నిర్మాణం చేసుకుంటున్నాం.
గత యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వే బడ్టెట్ రూ.251 కోట్లు… నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రూ.6వేల కోట్లకు పెంచారు. గత తొమ్మిదేళ్లలో రూ. 30 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైల్వే కోసం ఖర్చు పెట్టారు. మొట్టమొదటిసారిగా మెదక్ రైల్వే స్టేషన్ ని నేనే ప్రారంభించాను. సిద్దిపేట రైల్వేలైన్ ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రైల్వే లైన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.26వేల కోట్లతో నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే తొందరలోనే రీజినల్ రింగ్ రోడ్ పూర్తవుతుంది.
రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత 8,9 జిల్లాలను కిలిపే రింగ్ రైల్వే లైన్ ని కూడా ఏర్పాటు చేస్తాం. సిద్దిపేట-మనోహరబాద్ రైల్వే లైన్ ద్వారా రైతుల ఉత్పత్తులను సరఫరా చేస్తాం. కొమురవెల్లి రైల్వే స్టేషన్ నుండి దేవాలయం వరకు పక్కా రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం. టికెట్ బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్ నిర్మిస్తాం. ఫ్రీ వైఫై కూడా అందిస్తాం. మల్లిఖార్జున స్వామి పాదాల చెంత అత్యంత ఆధునికంగా రైల్వే స్టేషన్ నిర్మించుకుంటున్నాం. తెలంగాణ ప్రజల తరఫున ప్రధాన నరేంద్ర మోదీ గారికి, రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
దేశ ఆర్థికాభివృద్ధికి రైల్వే కీలక పాత్ర: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
నేను నా ఇంటికి తిరిగి వచ్చినట్లు అనుభూతి పొందుతున్నాను. కొమురవెల్లిని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ కు శంకుస్థాపన కార్యక్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. దేశంలో జరుగుతున్న రైల్వేల ఆధునీకరణ కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది.
దేశంలో తూర్పు-పడమర-ఉత్తర-దక్షిణం.. ఇలా అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెరిగింది. ఆర్మీ రవాణా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధికి రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మల్లన్న దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని అడ్వాన్స్ ఫీచర్లతో స్టేషన్‌ను త్వరగా నిర్మాణం జరగాలని ఆశిస్తున్నాను.
భారతదేశం కళలకు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు కాణాచి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశంలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణం. వసుధైక కుటుంబం అనే గొప్ప సూక్తి ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలో సరైన ఉదాహరణ. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబీలో నిర్మించిన ప్రప్రథమ హిందూ మందిరాన్ని ప్రారంభించుకోవడం గర్వకారణం.
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధ సమయంలో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. మహాకాల్ ఉజ్జయిని సందర్శించడానికి మధ్యప్రదేశ్ కు రావాలని నేను ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాను. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు మేము గర్విస్తున్నాము. శ్రీరాముడు చూపిన మార్గంలో మనమంతా ముందుకు నడవాలని ఆకాంక్షిస్తున్నాను.