జగన్ రెడ్డి మరోసారి వాలంటీర్లను బలిపశువుల్ని చేస్తున్నాడు

• తండ్రి అధికారంతో అవినీతికి పాల్పడి, 16 నెలలుజైల్లో ఉన్న వ్యక్తి అవినీతి లేని సమాజం.. లంచాలు లేని పాలన, విశ్వసనీయత, నిబద్ధత అంటుంటే ప్రజలకు నవ్వాలో, ఏడవాలో తెలియడంలేదు
• బలిచ్చే ముందు మేకల్ని అలంకరించినట్టు..నేడు మీ అంతటి వారు లేరంటూ వాలంటీర్లకు బిస్కట్లు వేస్తున్నాడు
• చంద్రబాబుకి ఓటేయవద్దని ప్రజలకు మీరైనా చెప్పండని జగన్ రెడ్డి వాలంటీర్లను అడుక్కునే దుస్థితికి దిగజారాడు
• వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలకు జగన్ రెడ్డి రూ.2వేలకోట్లు దోచిపెట్టాడు
• పులి శాఖాహారం తినడం ఎంత నిజమో… తాను, తన ప్రభుత్వం అవినీతి చేయలేదంటున్న జగన్ రెడ్డి మాటలు కూడా అంతే నిజం
• రక్తం పంచుకు పుట్టిన చెల్లికి సమాధానంచెప్పలేని జగన్ రెడ్డి , ప్రజల్ని మోసగించడానికి మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు
తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత

ఫిరంగిపురంలో షిక్కటి చిరునవ్వుతో ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో నేడు ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభ జగన్ రెడ్డి వీడ్కోలు సభను తలపించిం దని, వాలంటీర్ వ్యవస్థను తనకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చుకున్న జగన్ రెడ్డి, నేడు చంద్రబాబుకి ఓటేయవద్దని మీరైనా ప్రజలకు చెప్పాలంటూ వాలంటీర్లను అడుక్కునే స్థితికి వచ్చాడని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూ డి అనిత ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

బలిచ్చే ముందు మేకల్ని అలంకరించినట్టుగా ఎన్నికల ముందు వాలంటీర్లను జగన్ రెడ్డి బలిపశువుల్ని చేస్తున్నాడు
“ బలిచ్చే ముందు మేకల్ని అలంకరించినట్టుగా జగన్ రెడ్డి ఎన్నికల ముందు 2.50లక్షల మంది వాలంటీర్లను బలిపశువుల్ని చేస్తున్నాడు. వారి భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చడానికే జగన్ రెడ్డి వాలంటీర్లపై ప్రశంసలు కురిపించాడు. 5ఏళ్లు గా కేవలం రూ.5వేల జీతమిచ్చి వారి భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టాడు. వాలంటీర్లు అంటే మాకు, మాపార్టీకి ఎలాంటి ద్వేషం లేదు. ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులు కేవలం 5వేల జీతానికి పనిచేస్తూ వారి జీవితాలు పాడుచేసుకుంటున్నారు అన్నదే మా బాధ.

ప్రజలకు సేవలందించే నెపంతో వాలంటీర్ వ్యవస్థను జగన్, తన బానిస వ్యవస్థగా మార్చుకున్నాడు తాము విషసర్పం పడగనీడలో ఉన్నామనే వాస్తవాన్ని వాలంటీర్లు గ్రహించాలి
జగన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తన ప్రభుత్వ బానిస వ్యవస్థగా మార్చాడనేది వాస్తవం. వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలకే జగన్ రెడ్డి ఇన్నేళ్లుగా ప్రజల సొమ్ముని దోచిపెట్టాడు. జగన్ రెడ్డి భాష ప్రకారమే వాలంటీర్లు అంటే సేవకులు అయితే, వారు ప్రజలకు సేవ చేస్తే వారికి ఎలాంటి జీతం ఇవ్వాల్సిన పనిలేదు. కానీ రోజువారీ కూలీకి వచ్చే సొమ్ముకంటే తక్కువ ఇస్తూ పెద్దపెద్ద చదువులు చదివిన యువత జీవితాలను జగన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాలకు నాశనం చేయడం నిజంగా బాధాకరం. వాలంటీర్లకు వందనం పేరుతో జగన్ రెడ్డి వారికి నేడు బిస్కట్లు వేయడం కేవలం ఎన్నికల స్టంట్ లో భాగమే.

వాలంటీర్లుగా చేస్తున్న వారు మరే ఉద్యోగం చేసుకోకుండా చేసిన జగన్ రెడ్డి, నేడు వారిని ఆకాశానికి ఎత్తేసి తన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తమ భవిష్యత్ ను కాలరాసిన జగన్ రెడ్డికి వాలంటీర్లే తగిన బుద్ధిచెబుతారు. ఆ రోజు దగ్గర్లోనే ఉంది. వాలంటీర్లుగా చేస్తున్న యువత తమ భవిష్యత్ ఎలా మారిందో…ఏమైందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తామంతా విషసర్పం పడగనీడలో ఉన్నామనే వాస్తవాన్ని వాలంటీర్లు అర్థం చేసుకోవాలి.

పురస్కారాలు ఇవ్వాల్సింది వాలంటీర్లకు కాదు.. సైకోరత్న, మాఫియావజ్ర, విధ్వంస మిత్ర పురస్కారాలు జగన్ రెడ్డికి ఇవ్వాలి 
సేవారత్న.. సేవా వజ్ర.. సేవా రత్న పురస్కారాలు వాలంటీర్లకు ఇస్తున్న జగన్ రెడ్డికి నిజంగా ప్రజలు కొన్ని పురస్కారాలు ఇవ్వాలి. 5 ఏళ్ల జగన్ పాలన చూశాక ఆయనకు సైకోరత్న, మాఫియా వజ్ర,, విధ్వంస మిత్ర పురస్కారాలు ఇవ్వాలి. జగన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన.. అతని మోసపు వాగ్ధానాలు.. కల్లబొల్లి మాటలు .. చూశాక ఇలాంటి ఎన్నో పురస్కారాలకు దేశంలో ఆయనొక్క డే అర్హుడని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. లంచగొండితనం.. మోసకారీతనం, నిబద్ధత లేని తనానికి, నిరంకుశత్వానికి, మాటతప్పుడుకు, మడమ తిప్పుడు కు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డే.

ఆర్థిక నేరాలకు పాల్పడి, తండ్రి అధికారంతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడి, రూ.43వేలకోట్ల అవినీతి సొమ్ము ఈడీతో జప్తు చేయించు కొని, 16 నెలలు జైల్లో చిప్పకూడుతిని, ఇప్పటికీ అవినీతికేసుల విచారణ ఎదుర్కొంటూ, చివరకు అధికారం కోసం సొంత బాబాయ్ ను దారుణంగా చంపించిన జగన్ రెడ్డి నీతి..నిజాయితీ.. విశ్వసనీయత .. లంచాలు లేని పాలన అని మాట్లాడుతుంటే దేనితో నవ్వాలో ప్రజలకే తెలియడంలేదు. జగన్ రెడ్డి మాటలు విన్నాక ఇంతగొప్పగా తప్పుడు మాటలతో ప్రజల్ని మోసగిస్తాడా అని అర్థమైంది. జగన్ రెడ్డి నేడు మాట్లాడిన ప్రతిమాటలో.. ప్రతిపదంలో.. ఆయన ముఖంలో చంద్రబాబుని, తెలుగుదేశాన్ని చూసి భయపడుతున్నాడని అర్థమైంది.

పులి శాఖాహారం తింటున్నది అన్నది ఎంత నిజమో… తాను, తన ప్రభుత్వం అవినీతి చేయలేదు అంటున్న జగన్ రెడ్డి మాటలు కూడా అంతే నిజం
పులి శాఖాహారం తింటుంది అన్నది ఎంత నిజమో, తాను అవినీతి చేయలేదు.. లంచం తీసుకోలేదు అంటున్న జగన్ రెడ్డి మాటలు కూడా అంతే నిజం. 4 ఏళ్ల 10 నెలల పాలనలో జగన్ రెడ్డి నిజంగా పేదల జీవితాలు మార్చేశాడా? జగన్ పాలనలో పేదలు ఇంకా నిరుపేదలు అయ్యారు తప్ప, ఎక్కడా ఒక్క కుటుంబం కూడా బాగుపడింది లేదు. చంద్రబాబు పేదలకోసం అమలుచేసిన 130కి పైగా పథకాలు రద్దుచేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు సిగ్గులేకుండా చంద్రబాబు సంక్షేమం అందించలేదు.. పేదలకు ఎలాంటి పథకాలు అందించలేదని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు నిషేధం అనలేదు.. నియంత్రణ అన్నామని మాటమార్చడం అతని చేతగా ని తనానికి నిదర్శనం.

అలానే చంద్రబాబు అమలుచేసిన ఆదరణ, విదేశీవిద్య, పెళ్లికానుక, స్టడీ సర్కిళ్లు, అన్నా క్యాంటీన్లు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లతో పాటు బీసీ భవనాల నిర్మాణం వంటి పథకాల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి, పేదల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అసలు జగన్ రెడ్డికి ఓటు అడిగే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం.

తాను..తనపార్టీ ఎమ్మెల్యేలు అవినీతి చేయకపోతే, దొరికింది దొరికినట్టు దోచుకోకుంటే 80మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాడో జగన్ చెప్పాలి
తనకు ఓటేసి గెలిపించిన ప్రజల తరుపున జగన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాం. నిజంగా జగన్ రెడ్డి.. అతని పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి చేయకపోతే, ప్రజల్ని వేధించకపోతే, దొరికింది దొరికినట్టు దోచుకోకపోతే వాళ్లను ఎందుకు మార్చాడు? సుమారు 80మంది వైసీపీ ఎమ్మెల్యేలను నియోజకవర్గాలు మార్చాడంటే ఏ స్థాయిలో జగన్ రెడ్డి, అతని పార్టీ నేతలు ఏస్థాయిలో అవినీతికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు.

పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న గొల్ల బాబురావుని తీసే సి, ఎక్కడో శ్రీకాకుళంలోని రాజాంకు చెందిన వ్యక్తిని నియమించాడు. ఇలాంటి మార్పులు ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పుకోలేని జగన్ రెడ్డి.. సిగ్గు లేకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను విమర్శిస్తున్నాడు. 130 పథకాలు ఎందుకు రద్దుచేశాడో పేదలకు సమాధానం చెప్పాకే జగన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి.

రక్తం పంచుకు పుట్టిన చెల్లికి సమాధానం చెప్పలేని జగన్, ప్రజల్ని మోసగించడా నికి మాత్రం నోటిని తాటిమట్టకంటే దారుణంగా వాడుతున్నాడు
తనకు టీవీలేదు.. పేపర్ లేదు.. డబ్బులు లేవు, ప్యాలెస్ లు లేవు అని అబద్ధాలు చెబుతున్న జగన్ రెడ్డి నిజంగా ఏకాకే. ఎవరూ లేని ఏకాకి. ఆఖరికి తల్లి, చెల్లీసహా ఎవరూ అతనితో లేరు. రక్తం పంచుకు పుట్టిన చెల్లికి సమాధానం చెప్పలేని వ్యక్తి, ప్రజల్ని మోసగించడానికి మాత్రం నోటిని తాటిమట్ట కంటే దారుణంగా వాడేస్తున్నాడు. టీడీపీప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అరాచకం చేశాయని అరాచకవాది జగన్ రెడ్డి చెప్పడం పెద్ద అరాచకం. జగన్ రెడ్డి నిజంగా అవినీతి చేయకపోతే ఇసుక విధానం పారదర్శకంగా ఎందుకు లేదో సమాధానం చెప్పాలి.

మద్యం దుకాణాల్లో ఎందుకు ఆన్ లైన్ చెల్లింపులు లేవో చెప్పాలి. బటన్ నొక్కుతున్నాను అని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి.. తాను నొక్కేస్తున్న సొమ్ము గురించి ప్రజలకు చెప్పడేం? ఇసుక, మద్యం, ఖనిజసంపద సహా అంతా లూఠీనే. జీతాలు పెంచమని అడిగిన నేరానికి వాలంటీర్లను పోలీసులతో కొట్టించి న జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కయ్యారు. ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో నాలుగేళ్ల 10నెలల్లో రూ.,2,000కోట్ల ప్రజల సొమ్ముని జగన్ రెడ్డి వైసీపీ కార్యకర్త లకు దోచిపెట్టాడు. అదే సొమ్ముతో గ్రామాల్లో రోడ్లు వేయడం… వీధిదీపాలు పెట్ట డం.. తాగునీరు అందించడం లాంటి పనులు చేయవచ్చు.

అలాంటి పనులు చేస్తే తనను ఎవరు పట్టించుకుంటారు..అందుకే జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టాడు. పిచ్చివాడు ఒక్కడే ఉంటాడు..అతనిపై రాళ్లేసేవాళ్లు ఎందరో ఉంటా రు. అలానే జగన్ రెడ్డి తనను తాను సింహమని చెప్పుకుంటే సరిపోదు. ఎవరు ఏమిటనేది వచ్చేఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు.” అని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

Leave a Reply